Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay: బండి సంజయ్ కి మంత్రి యోగం

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి పదవి దక్కడంపట్ల తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి.

తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం
సంజయ్ కు మంత్రి పదవి కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవమిది
బండి సంజయ్ చేసిన పోరాటాలు అసామాన్యం
ప్రజాసంగ్రామ యాత్రతో కేసీఆర్ స ర్కార్ పై అలుపెరగని ఉద్యమాలు
మైనారిటీలు గంప గుత్తగా ఓట్లేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడించి నా వీడని హిందుత్వ వాదం
నమ్మిన సిద్దాంతం కోసం ఎందా కై నా తెగించే మనస్తత్వం సంజయ్ సొంతంది
కేంద్ర మంత్రి పదవి దక్కడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు

ప్రజా దీవెన, హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(MP Bandi Sanjay Kumar) కేంద్ర మంత్రి పదవి దక్కడంపట్ల తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. ముఖ్యంగా బండి సంజయ్ ను తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బీజేపీ(BJP) కార్యకర్తల ఆనందానికి ఆవ ధుల్లేకుండా పోయాయి.సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా వారు భావిస్తు న్నారు. పార్టీలో కార్యకర్తగా చేరింది మొద లు ఏ పదవిలో ఉన్నా నిరం తరం ప్రజల పక్షాన నిరంతరం పోరా టాలు చేయడమే లక్ష్యంగా పని చేసిన బండి సంజయ్ కు అమా త్య పదవి లభించడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం విశేషం.

సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి లభించడంపట్ల కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయం లో పట్టణాలకే పరిమి తమైన బీజేపీని మారు మూల పల్లెల్లోకి విస్తరిం పజేయడం లో బండి సంజయ్ చేసిన క్రుషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుం టున్నారు. ప్రజాసంగ్రామ యాత్రతో(People’s movement)16 వందల కిలోమీటర్ల కుపైగా పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచారని, కేసీఆర్ పాలన అంతానికి బండి సంజయ్ పాదయాత్రతోనే అడుగులు పడ్డాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఆనాడు గొంతెత్తి ప్రశ్నించడానికే వీల్లేకుండా నిరస నలపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్(KCR) సర్కార్ పై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఉద్యమాలు చేసేందుకు వెనుకాడిన సమయంలో….. బీజేపీ రాష్ట్ర రథసారథిగా కార్యకర్తలందరినీ ఏకోన్ముఖులను చేసి రైతుల, నిరుద్యోగుల, ఉద్యోగుల, మహిళల సమస్యలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటు న్న కష్టాలపై అడుగడుగున పోరా టాలు చేసి బీజేపీని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత బండి సంజయ్ దే. గత ఐదేళ్లపాటు కుటుంబానికి దూరమై బండి సంజయ్ చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం బండి సంజయ్ సొంతం. నిరంతరం ప్రజల్లో ఉండటం… నిత్యం కార్యకర్తలతో కలిసి నడవడం బండి సంజయ్ ప్రత్యేకత. ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ లాఠీఛార్జీలు, కేసులు, అరెస్టులకు లెక్క చేయని చరిత్ర సంజయ్ దే.
రైతులకు భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల(Wood buying centers) వద్దకు వెళుతుంటే నాటి అధికార పార్టీ మూకలు రాళ్ళ దాడికి తెగబడినా వెనుకంజ వేయకుండా ధీటుగా ఎదుర్కొని రైతులకు అండగా నిలిచిన ధీశాలి సంజయ్ రైతుల పక్షాన అనేక దీక్షలు చేపట్టారు. నిరుద్యోగ మార్చ్ పేరుతో జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలతో నిరుద్యోగుల పక్షాన పోరాడారు.

బండి సంజయ్ పోరాటాలతో బెంబేలెత్తిన నాటి కేసీఅర్ సర్కార్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపి అక్రమంగా అరెస్ట్ చేసినా వెనుకంజ వేయకుండా ఉద్యమించి కాషాయ పార్టీ పోరాట పటిమను చాటి చెప్పారు. 317 జీవోను సవరించా లని ఉద్యోగుల పక్షాన పోరాడి సర్కార్ ను గడగడలాడించిన ఘనత కూడా సంజయ్ దే. సంజ య్ ధాటికి తట్టుకోలేని నాటి బీఆర్ ఎస్ పాలకులు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులను పంపి గ్యాస్ కట్టర్లతో ఆఫీస్ గేట్లను ధ్వంసం చేయించి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి భవిష్యత్తులో దీక్షలు చేయకుండా బీజేపీని కట్టడి చేయాలని చూశారు. అయినా వెరవని సంజయ్ కేసీఅర్ సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేసి నాటి ప్రభుత్వ పతనంలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఎంపీగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాడి రెండు సార్లు జైలుకు వెళ్లిన ఘనత కూడా బండి సంజయ్ దే. ప్రజల కోసం, కార్యకర్తల కోసం కొట్లాడి భారతదేశంలోనే అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ కూడా బండి సంజయ్ మాత్రమే కావడం గమనార్హం. అట్లాంటి వ్యక్తికి మోడీ కేబినెట్(Modi Cabinet)లో చోటు దక్కడంతో కార్యకర్తల భావోద్వే గంతో ఉప్పొంగిపోతున్నారు. నిజా నికి బండి సంజయ్ రాజకీయ జీవిత ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయ న రాజకీయ జీవితమంతా ఆటు పోట్లమయమే. కరీంనగర్ లో మధ్య తరగతి కుటుంబంలో జన్మిం చిన బండి సంజయ్ సామా న్య బీజేపీ కార్యకర్తగా ప్రస్తా నాన్ని ప్రారంభించి అంచెలం చెలుగా ఎదిగారు.

రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా(MLA) పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసిం చే ప్రాంతంలో గంప గుత్తగా బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనా డూ హిందుత్వ భావజాలాన్ని వీడలేదు. బీజేపీ హిందుత్వ భావజాలాన్ని నరనరాన పుణికిపు చ్చుకున్న బండి సంజయ్ ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీ య ప్రయోజనాల కోసం తను నమ్మిన సిద్దాంతాన్ని ఏనాడూ పక్కన పెట్టలేదు. ఎన్ని ఇబ్బం దులు ఎదురైనా, మరెన్ని అవమా నాలు ఎదురైనా అధిగమి స్తూ ముందుకు సాగారు. అందుకే బీజేపీలో కార్యకర్తలందరికీ బండి సంజయ్ ‘హిందుత్వ ఐకాన్’ గా మారారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections)89 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు.

ఆ తరువాత బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని ఉద్యమాలు చేస్తూ బీజేపీపీ రాష్ట్రవాప్తంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ను అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించడం రాష్ట్రంలో పెను సంచలనమైంది. ముఖ్యంగా కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారి, బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకెళ్లారు. కానీ బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించిన ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections)బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయిందని సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానించారంటే సంజయ్ పని తీరు ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలి.

రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత పదవిని బండి సంజయ్ కు కట్టబెట్టినప్పటికీ కార్యకర్తల్లో అసంత్రప్తి తగ్గలేదు. అందుకే బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కగానే బీజేపీలో కష్టపడే కార్యకర్తలంతా తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే బండి సంజయ్ కు కేంద్రంలో ఏ శాఖ అప్పగించినా… ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వర్తించడంతోపాటు ఆ శాఖ ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టిసారిస్తారనే నమ్మకం తమకుందనే అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Mantri yoga to Bandi Sanjay