Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Medical convener quota:మెడికల్ కన్వీనర్ కోటానూరుశాతం తెలంగాణ విద్యార్థులకే దక్కాలి

తెలం గాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థాని కత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలం గాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం

వైద్య విద్య ప్రవేశాలకు సంబంధిం చి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వా లి
అడ్మిషన్ల ప్రక్రియ సమీపిస్తున్నప్ప టికి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది
మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలం గాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థాని కత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో(Medical colleges) కన్వీనర్ కోట సీట్లు 100 శాతం సీట్లు తెలం గాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ వైద్యా రోగ్య శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు(MLA Harish Rao)డిమాండ్ చేశారు. జూన్ మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదల వుతున్న క్రమంలో ప్రభుత్వం తక్ష ణం స్పందించి స్పష్టత ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.

లేదంటే వైద్య విద్య చదివే అవ కాశాలను తెలంగాణ(Telangana) విద్యార్థు లు తీవ్రంగా కోల్పోతారని హరీశ్‌ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కు ముందున్న 20 మెడిక ల్ కాలేజీ ల్లోని 2,850 సీట్లలో కాంపి టెంట్ అథారిటీ కోటా కింద 1,900 సీట్లు ఉన్నాయని, ఇందులో 15శా తం అన్ రిజర్వుడు కోటా అంటే 280 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పో తారని చెప్పారు. దీంతో పాటు నిమ్స్ సహా ఇతర మెడికల్ కాలేజీ ల్లోని దాదాపు 150 పీజీ సీట్లు కోల్పోతారు అని హరీశ్‌రావు వెల్లడించారు.ఎంబీబీఎస్, పీజీ అడ్మిషన్ల ప్రక్రియ సమీపిస్తున్నప్పటి కీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమై న విషయాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం దురదృష్ట కరమన్నారు.

తెలంగాణ విద్యార్థు ల ప్రయోజనాలు కాపాడడంలో కాం గ్రెస్(Congress) ప్రభుత్వం వైఫల్యం చెందుతు న్నదని, ప్రభుత్వ తీరుతో తల్లిదం డ్రులు, విద్యార్థులు తీవ్రంగా ఆందో ళన చెందుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభ జన చట్టం మేరకు 2014 నుండి కన్వీనర్ కోటాలో(Convenor Quota)15శాతం సీట్లకు తెలంగాణతో పాటు, ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు సైతం పోటీపడే వెసు లుబాటు కల్పించారన్నారు. ఇదే విధానం కొనసాగితే 2014 తర్వాత ఏర్పాటు చేసిన కొత్త మెడి కల్ కాలేజీల్లో కూడా 15 శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుందని, దీని వల్ల దాదాపు 520 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

దీన్ని నివారించేందు కు గాను తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేసిందని హరీశ్‌రావు తెలిపారు. దీనికోసం ఏపీ రీఆర్గనైజ షన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధన లకు లోబడి తెలంగాణ స్టేట్ మెడిక ల్ డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ గత బీఆర్ ఎస్(BRS) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. తద్వారా 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటే టివ్ అథారిటీ కోటాలోని 100శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయడం జరిగింది.

ఈ నిర్ణ యం వల్ల తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభించాయని, అయితే ప్రస్తుతం జూన్ 2తో విభజన చట్టానికి కాలం చెల్లుతుందటంతో పాత మెడికల్ కాలేజీలోని 100 శాతం కన్వీనర్ కోటా సీట్లను కూడా తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ(Super specialty)సేవలు చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందిం చేందుకు కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారని, తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేర్చించింది.

ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత అని చెప్పారు. దీంతో తెలంగాణలో 2850 ఎంబీ బీఎస్(MBBS) సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పు డు 8340 సీట్లకు పెరిగిందని, ఎంబీ బీఎస్, పీజీ సహా ఇతర వైద్య విద్య అభ్యసించాలనుకునే తెలంగాణ బిడ్డలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే, స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశా రు. కన్వీనర్ కోటా లోని 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చూడాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని డాక్టర్ కావాలనుకునే వైద్య విద్యా ర్థుల అవకాశాలు మెరుగుపరచా లని హరీశ్‌రావు కోరారు.

 

Medical convener quota give to Telangana students