Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

METRO TRAIN: వామ్మో మెట్రో రైలు

–విపరీత రద్దీతో రచ్చ రచ్చ
–వ‌ర్షం దెబ్బ‌కు పెరిగిన ట్రా ‘ ఫీకర్’
–బ‌స్సులు వ‌దిలి మెట్రో వైపు జ‌నం
–అన్ని స్టేష‌న్ల లోనూ జ‌నసంద్రం
–రైలులో అడుగుపెట్టేందుకు,
లోప‌లి వెళ్లేందుకు ప్ర‌యాణీకులు అష్టకష్టాలు

METRO TRAIN: ప్రజా దీవెన, హైదరాబాద్: సిటీలో వర్ష బీభత్సం ఎఫెక్ట్ ట్రాఫిక్ పై (Rainfall effect traffic) ప డింది. రోడ్లపై నీళ్లు నిలవటంతో ట్రాఫిక్ జాం (TRAFFIC)ఉంది. దీంతో ప్రయాణి కులు అందరూ మెట్రో వైపు వెళ్లా రు , మామూలుగానే రెగ్యులర్ గా ఉదయం సమయంలో మెట్రో రైళ్లు కిటకిటలాడతాయి.. అలాంటిది.. రోజు వారీ కంటే అదనంగా వేలాది మంది ఒక్కసారిగా మెట్రో స్టేషన్లకు రావటంతోకిటకిటలాడుతున్నాయి.సిటీ వ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో స్టేషన్లలోనూ రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ ఉంది. అదే విధంగా ఆన్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకుని ఫ్లాట్ ఫాంకు చేరుకుంటున్నారు ప్రయాణికులు. ఈ క్రమంలోనే రైలు ఎక్కేందుకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అమీర్ పేట, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, హైటెక్ సిటీ, ఉప్పల్ మెట్రో స్టేషన్లు (Ameer Peta, Kukat Pally Housing Board, LB Nagar, Dil Sukh Nagar, Hi-Tech City, Uppal Metro Stations)అయితే తిరనాళ్ల జాతర ఉన్నట్లు ఉన్నారు ప్రయాణికులు.

మెట్రోస్టేషన్లలో ఒక్కసారిగా పెరిగిన రద్దీతో.. రైలు ఎక్కాలంటే స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు, మూడు రైళ్లకు ఆగితేనే ఎక్కగలుగుతున్నారు. ప్రతి మూడు నిమిషాలకు ఓ సర్వీస్ నడుస్తుంది.. ట్రాఫిక్ జాం, వర్షాలతో ప్రయాణికు లు (Traffic jam, rains for commuters)పెరగటంతో.. రైళ్లు సరిపోవటం లేదు. సర్వీసులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు.వర్షాలు, ట్రాఫిక్ జాం వల్ల రెగ్యులర్ గా బైక్స్, కార్లలో వెళ్లే వేలాది మంది ఇప్పుడు మెట్రో వైపు రావటంతో రష్ పెరిగింది అంటున్నారు మెట్రో అధికారులు.