BC Rights: హక్కుల సాధన కోసం మిలిటెoట్ పోరాటo
బీసీల న్యాయపరమైన రిజర్వేషన్ల హక్కుల సాధన కోసం మిలిటెట్ పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
ప్రజా దీవెన, హైదరాబాద్: బీసీల న్యాయపరమైన రిజర్వేషన్ల హక్కుల సాధన కోసం మిలిటెట్ పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah)పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో కామారెడ్డి డిక్ల రేషన్-సమగ్ర కులగణన అనే అం శంపై బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పా ల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వని ఆధిపత్య కుల పార్టీలు కనీసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడం బాధాకరమని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ(Congress party)ఇచ్చిన హామీల అమ లు కోసం బీసీ సంఘాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్న అభి ప్రాయం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఏం మాత్రం చిత్తశుద్ధి ఉన్నా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తేవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమా ర్(R. S. Praveen Kumar)డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ల్లో తేలిన బీసీల లెక్కల ఆధారంగా నైనా ఆర్డినెన్స్ తెచ్చి బీసీలకు రిజ ర్వేషన్లు ఇవ్వొచ్చని అన్నారు. ఎన్నాళ్ళు ప్రత్యేక అధికారులను పెట్టి గ్రామాలను పరిపాలించాలం టూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థా నిక సంస్థల ఎన్నికలు సిద్ధం అవు తారని చెప్పారు. బీసీలను మరో సారి మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందన్న ఆయన బీసీల రిజర్వేషన్ల సాధన కోసం ఎలాంటి కార్యాచరణ తీదుకున్నా తాను ఎప్పుడూ ముందుంటానని అన్నా రు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్(Rajaram Yadav)మాట్లాడుతూ సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వే షన్ల సాధన కోసం ఎలాంటి త్యాగ లకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటిం చారు.
సమగ్ర కులగణనతోపాటు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని రాజారాం యాదవ్ ప్రకటించారు. ఇక ఈ నెల 15న ఇందిరాపార్కు దగ్గర బీసీ జనసభ తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి బీసీ కుల, సంఘాల ఐక్య వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ కార్యక్ర మంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ వెంకటేష్, ఎంపీటీసీల ఫోరమ్ నాయకులు బోళ్ల కరుణా కర్, జగన్మోహన్ ముదిరాజ్, గిరి జన రిజర్వేషన్ సాధన సమితి చైర్మ న్ సంజీవ్ నాయక్, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేం దర్, హిందూ బీసీ మహాసభ అధ్య క్షుడు బత్తుల సిద్ధేశ్వర్,(Battula Siddeshwar),అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్, ఎలక్ట్రా నిక్ మీడియా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు రమణ కుమార్, టి.జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి మేకల క్రిష్ణ, అడ్వాకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, బీసీ ఐక్యవేధిక చైర్మన్ కాటం నర్సిహ్మ యాదవ్, పద్మశాలి సంఘం నాయకులు నరేందర్, అశోక్ పోషమ్, కీర్తి లతా గౌడ్, ఏటి గడ్డ అరుణ, దత్తాత్రేయ, లింవం, చాపర్తి కుమార్ గాడ్గే, అహరిత్ రుడా, పోచబోయిన శ్రీహరి యాదవ్, రామేశ్వర్, నాగరాజు, ఏలేశ్వరం వెంకటేష్, దేశం మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Militeot porratao for the realization rights