Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister seethakka: మంత్రి సీతక్కఆకస్మికంగా సందర్శన

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ ను పంచాయతీ రాజ్ గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మంగళవారం ఆకస్మికంగా సందర్శిం చారు.

ప్రజా దీవెన, హైదరాబాద్:మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్(Mahatma Jyotiba Phule Praja Bhavan)ను పంచాయతీ రాజ్ గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Sitakka)మంగళవారం ఆకస్మికంగా సందర్శిం చారు. మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో ప్రజావాణి కార్య క్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి(Chinna Reddy)తో కలిసి ప్రజల నుండి దరఖా స్తులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్య లను ప్రజాప్రతినిధులకు, అధికారు లకు వివరించారు. గ్రేటర్ హైదరా బాద్ డ్రైవర్ కమ్ ఓనర్ అసోసి యేషన్(Driver Cum Owner Association)సభ్యులు ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలల్లో పెరిగినందున ప్యాకేజీ పెంచాలని కోరారు.

అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోద య్యాయి. రెవెన్యూ పరమైన సమ స్యలకు సంబంధించి 219 దరఖా స్తులు, మున్సిపల్ శాఖకు సంబం ధించి 54, హోం శాఖకు(Home Department)సంబం ధించి 52, హౌసింగ్ శాఖకు సంబం ధించి 44, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 46, ఇతర శాఖలకు సంబంధించి 287 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు శ్రీమతి దివ్య(Director of Municipal Department Mrs. Divya), ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించండం తో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Minister seethakka visited Prajavani