— మీరు పదేళ్లలో చేయలేని రుణ మాఫీ మేము ఒకే పంట కాలంలో చేసాం
–మీకన్నా లక్షన్నర మంది రైతులకు అదనంగా ఇప్పటికే రుణ మాఫీ చేసాం
–అర్హులైన ప్రతి రైతుకు రుణ మాఫి చేస్తాం, బోనస్ గురించి మీరు ప్రశ్నించడం విడ్డూరం
— మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి సీతక్క ఆగ్రహం
Minister Sitakka: ప్రజా దీవెన, హైదరాబాద్: పంట రుణాల మాఫిపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) గురువింద కథలు చెబుతున్నారని గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. తమ హాయంలో అర్హులైన రైతు లందరికి రుణ మాఫీ జరిగినట్లు, కాంగ్రెస్ ఈ పది నెలల కాలంలో రుణ మాఫీని పట్టించుకోనట్లు పదే పదే అవా స్తవాలను వల్లే వేస్తూ గురువింద తన నలుపెరగదు అన్న సామేతను గుర్తు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్య లపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ ఈ విధంగా వాక్యానించారు.
తొమ్మి దిన్నర ఏళ్ల బీఆర్ఎస్ హయంలో పంట రుణ మాఫీని (Crop loan waiver) అబాసు పాలు చేసారు. 2018 నుంచి 2023 వరకు అంటే ఐదేండ్లలో లక్ష లోపు పంట రుణాలను ఆర్దిక మంత్రిగా వెలగబెట్టిన మీరు ఐదు విడతల్లో అరకొరగా రుణ మాఫి చేసారు. మీ లెక్కల ప్రకారమే 21.35 లక్షల మంది రైతులకు రుణ మాఫీ కోసం రూ. 11,910 కోట్లు ఖర్చు చేసి నట్లు చెప్పారు అది కూడా విడతల వారిగా చెల్లించడంతో వడ్డీకే సర్దుబాటు అయ్యింది. దీంతో రైతులు రుణ విముక్తులు కాలేదు. కాని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఒకే పంట కాలంలో ఏకంగా 18 వేల కోట్ల రుణాలను ఏకకాలంలో మాఫి చేసి 23 లక్షల మంది రైతులను రుణ విముక్తిల్ని చేసి వారి గుండెల మీద భారాన్ని దించింది*. మిగిలిన పంట రుణాలను మాఫి (Crop loan waiver) చేస్తామనే నమ్మకంతో రైతులు నిశ్చింతంగా ఉన్నారు. మీరు ఐదేండ్లలో చేయ లేని పనిని.. మేము కేవలం 27 రోజుల్లోనే చేసి చూపించాం. అది రైతుల పట్ల మా కమిట్మెంట్.
మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు (intrest) కలిపి తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రోజుకు రూ. 207 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోం ది. అయినప్పటీకీ ఆర్దిక క్రమశి క్షణతో, సుపరిపాలనతో మీ పదేల్ల పాపాన్ని కడిగి అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం. ఆర్దిక వెసు లుబాటును బట్టి రుణ మాఫీపై నిజాయితితో పనిచేస్తున్నాం. సాంకేతిక, ఇతరాత్ర సమస్యలతో రుణ మాఫీ కాని రైతుల కోసం పటిష్టమైన ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి అర్హత గల ప్రతి కుటుంబానికి రుణ మాఫీని వర్తింప చేసే చర్యలు తీసుకుంటున్నాం. అయినా మీ అవాస్తవాలు ఆగడం లేదు.ఇక పంట బోనస్ విషయం లోనూ ఇదే వైఖరిని మీరు కొనసా గిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో పాలకుర్తి నియోజక వర్గం కొడకండ్ల సభలో నాటి సీఎం కేసీఆర్ గారు సన్న వడ్లకు కనీస మద్దతు మీద బోనస్ ఇస్తామని హమీ ఇచ్చారు. ఆ తర్వాత రెండేల్లు అధికారంలో ఉన్నా..సన్న వడ్లకు నయా పైసా బోనస్ ఇవ్వలేదు. బోనస్ కాదు కదా కనీస మద్దతు ధర అంద లేదు. తాలు తరుగు పేరుతో కోతలు పెట్టి రైతులను (farmers) నిండా ముంచారు. అయినా మీరు పట్టించుకోలేదు. అప్పుడు బోనస్ మాటిచ్చి వంచించిన పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్ లోనే మీరు పంట బోనస్ గురించి ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది.
10 నెలలుగా ఫీ రియంబర్స్మెంట్ (Fee Reimbursement) చేయలేదని మీరు విద్యార్ధుల మీద కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. 5 వేల కోట్లకు పైగా ఫీ బకాయిలను విద్యార్ధులకు మీరు చెల్లించలేదు. మీరు ఫీ బకాయిలు చెల్లించకపోవడంతో..కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపిస్తే వనపర్తి జిల్లాకు చెందిన లావణ్య అనే దళిత విద్యార్దిని తన దుస్థితి ని ఏడుస్తూ వీడియో రికార్డు చేసి తన గుడిసేలో ఆత్మహత్య చేసుకున్న సంగతి మీరు మర్చిపోయినా..లావణ్య ఆర్తనాదం ఇంకా తెలంగాణ సమాజంలో మారుమోగుతూనే వుంది*. వీటన్నింటిని ఓ సారి గుర్తు చేసుకుని, ప్రజా ప్రభుత్వంపై గుడ్డి విమర్శలు చేయడం మానుకోవాలి.హర్యానాలో బిజెపి విజయంతో ఇక్కడ బి ఆర్ ఎస్ (BRS)సంబురపడటం చూస్తే ఆ రెండు పార్టీలు ఒకటే అని మరో సారి రుజువయ్యింది.