Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sitakka: అంగన్వాడి కేంద్రాలకు సక్రమ సరఫరా

–అక్రమాలు చేస్తే తప్పకుండా తప్పిస్తాం
–అంగన్వాడి కేంద్రాల సప్లయర్లను హెచ్చరించిన మంత్రి సీతక్క

Minister Sitakka: ప్రజా దీవెన, హైదరాబాద్: అంగ న్వాడి కేంద్రాలకు నాణ్యత లేని వస్తువులు సరఫరా చేస్తే కాంట్రా క్టులను రద్దు చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హెచ్చ రించారు. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన గుడ్లు, వస్తువులు సరఫరా చేయండి, లేకపోతే తప్పుకొండి లేనీ పక్షంలో తామే తప్పిస్తామని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడి కేంద్రా లకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాలు, కోడి గుడ్లు నాణ్యత పెంపు కోసం సప్లై కాంట్రాక్టర్లతో మంత్రి సీతక్క, శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ తో కలిసి శుక్రవారం సచివా లయంలో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క (Minister Sitakka) అంగన్వాడి కేంద్రాలకు పేద పిల్లలు వస్తారని వారికి పోషకాహారం అందించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు.

అందుకే అంగన్వాడి కేంద్రాలకు (Anganwadi Centers) నాణ్యమైన వస్తువులు సరఫరా చేయాలని తేల్చి చెప్పారు. నాణ్యమైన గుడ్లు సరఫరా చేయటం లేదని వార్తలు రావడంపై సప్లయర్ల వివరణ కోరారు. అంగన్వాడి సెంటర్లకు సంబంధించి విమర్శలు భరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని అందుకే సప్లయర్లంతా నాణ్యత ప్రమాణా లను పాటిస్తూ గుడ్లు ఆహార వస్తువులను సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నాణ్యమైన వస్తువులు సరఫరా చేయకపోతే ఒప్పందాలను రద్దు చేసుకొని కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తామని మం త్రి హెచ్చరించారు. బిఆర్ఎస్ (brs)హయాంలో కాంట్రాక్ట్ కుదుర్చు కు న్న సప్లయర్లే ఇప్పటికీ కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారనీ, తాము సప్ల యర్లను మార్చలేదనీ, అందుకేసప్ల యర్లు మరింత శ్రద్ధతో మంచి గుడ్లను సరఫరా చేయాలనీ సూచిం చారు. మీ తీరు సరిగా లేకపోవడం వల్ల ప్రభుత్వం బదనం కావాల్సి వస్తుందని, తీరు మార్చకపోతే పక్క న పెట్టాల్సిన అవసరం వస్తుందని మంత్రి హెచ్చరించారు. నాసిరకం గుడ్లు సరఫరా చేస్తున్నారన్న వార్త లు ఎందుకు వస్తున్నాయని మంత్రి సప్లయర్లను ప్రశ్నించారు.

అయితే ఏ ఒక్క అంగన్వాడీ కేంద్రంలో (Anganwadi Centers) కోడి గుడ్ల విషయంలో సమస్యలు ఉత్ప న్నం కావట్లేదని, కేవలం టేక్ హోమ్ రేషన్ లో భాగంగా ఇంటికి తీసుకు వెళుతున్న గుడ్లవల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని సప్లయర్లు మం త్రి దృష్టికి తీసుకువచ్చారు. గుడ్లను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత సకా లంలో వాడకుండా చాలా రోజుల తర్వాత వినియోగించడం వల్ల గు డ్లు మురిగిపోతున్నాయని సప్లయ ర్లు తెలిపారు. ఈ సమస్య ఉత్ప న్నం కాకుండా తగిన చర్యలు తీసు కోవాలని సిబ్బందిని, సప్లయర్లను మంత్రి ఆదేశించారు. సకాలంలో గుడ్లను వినియోగించుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పిం చాలని సూచించారు. గాలి వెలు తురు సోకేలా అంగన్వాడి సెంటర్లలో గుడ్లను స్టాక్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. టేక్ హోమ్ రేషన్ కారణంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించేలా ఆ పథకంలో సంస్కరణలు తీసుకురావాలని మంత్రి చెప్పారు. అంగన్వాడీ టీచర్లు సిబ్బంది మరింత క్రియాశీలకంగా పనిచేయాలని, నాణ్యత లేని వస్తువులను రిజెక్ట్ చేయాలనీ, లేకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అయితే పెరిగిన రేట్ల కనుగుణంగా కోడిగుడ్ల రేట్లను పెంచాలని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నట్లుగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అంగన్వాడీ (Anganwadi Centers) సప్లయర్లకు త్వరగా బిల్లు చెల్లించాలని సప్లయర్లు కోరగా… ధరలు పెంచేందుకు మంత్రి సీతక్క ససేమిరా అన్నారు. ఒప్పంద పత్రాల్లో కుదుర్చుకున్న నిబంధనలను కాదని ధరలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీల బిల్లుల చెల్లింపు కోసం గ్రీన్ ఛానల్ ఉండేదని.. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని రద్దు చేశారని.. గత పది ఏళ్లలో పూర్తిగా ఈ వ్యవస్థ గాడి తప్పిందన్నారు. గాడి తప్పిన వ్యవస్థను సరైన మార్గంలో నడిపించి అంగన్వాడి కేంద్రాల్లో మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి సీతక్క తేల్చి చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది తమను ఇబ్బందుల గురిచేస్తున్నారని, వారు చెప్పినట్టు నడుచుకోకపోతే తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోయారు. నిజంగా అవి తప్పు లేనప్పుడు తప్పుడు వార్తలు రాస్తే చర్యలకు ప్రభుత్వం వెనకాడదని మంత్రి(minister) స్పష్టం చేశారు.