–ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ చిరంజీవే
–చివరి శ్వాస వరకు పేదలు, కార్మి కుల కోసo పరితపించారు
–ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించిన మంత్రి శ్రీధర్ బాబు
ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పీజేఆర్ (పి.జనా ర్థన్ రెడ్డి ) అంటే పేరు కాదని, ఒక బ్రాండ్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొ న్నారు. శనివారం పీజేఆర్ 17వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ కూడలి లోని ఆయన విగ్రహానికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూల మాల వేసి నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా పేదలు, కా ర్మికులు, కాంగ్రెస్ పార్టీ బలోపే తా నికి పీజేఆర్ చేసిన సేవలను ఆయ న గుర్తు చేసుకున్నారు. ‘కొంత మంది రాజకీయ నాయకులే ప్రజల గుండెల్లో చిరంజీవిగా ఉంటారని, ఆ జాబితాలో పీజేఆర్ ముందు వరుసలో ఉంటారని గుర్తు చేశారు. పేదలు, కార్మికుల పక్షపాతిగా చివ రి శ్వాస వరకు వారి కోసమే తపిం చారని కొనియాడారు.
చివరి వర కు వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే శ్వాసగా బతికారన్నారు. సీఎల్పీ నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతు న్న అన్యాయాలపై గళమెత్తడమే కాకుండా నా ప్రాంతం, నా ప్రజలే ము ఖ్యం అంటూ సొంత పార్టీ సీఎం పైనే ధిక్కార స్వరం వినిపిం చారని వివరించారు. ఎంతో మం దికి రాజకీయాల్లో ఓనమాలు నే ర్పించి, పెద్ద పెద్ద నాయకులుగా త యారు చేశారని గుర్తు చేసుకున్నా రు. పీజేఆర్ స్ఫూర్తితోనే ‘ప్రజా ప్రభుత్వం’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని పేదలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమం లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.
Minister SridharBabu