Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Anirudh Reddy: పేద విద్యార్థులకు బాసటగా ఎమ్మెల్యే

–బాటా బూట్లతో బాసటగా నిలిచిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
–వినూత్న పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
–సొంతనిధులతో ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని అభినం దించిన సీఎం

MLA Anirudh Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుకొనే పేద విద్యర్థు లకు బాటా బూట్లను ఉచితంగా ఇచ్చే వినూత్న పథకాన్ని రాష్ట్ర ము ఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) లాంఛనంగా ప్రారంబిoచారు. తన సొంత నిధులతో ఈ పథకాన్ని చేప ట్టిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని (MLA Anirudh Reddy) ఈ సందర్భంగా సీఎం అభినందించా రు. హైదరాబాద్ లోని ముఖ్యమం త్రి నివాసంలో శుక్రవారం ఏర్పటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి జడ్చర్ల నియోజక వర్గంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు బటా బూట్లను (Bata shoes)అందించారు. ఈ సందర్భం గానే సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

పేద కుటుంబాలకు (For poor families)చెందిన విద్యర్థు లు చదువుకొనే ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యా ప్రమణాలను మరింతగా మెరుగుపర్చలన్న లక్ష్యంతోనే గత ఏడాది కంటే రూ.2199 కోట్లు అధి క మొత్తాన్ని ఈ ఏడాది వార్షిక బడ్జె ట్లో విద్యారంగానికి కేటాయించామ ని తెలిపారు. 2023-24 సంవత్స రంలో విద్యా రంగానికి రూ.19,093 కోట్లను గత ప్రభుత్వం కేటాయించ గా ఈ ఏడాది తమ ప్రభుత్వం రూ. 21,292 కోట్ల మొత్తాన్ని విద్యారం గానికి కేటాయించడం జరిగిందని రేవంత్ రెడ్డి వివరించారు. విద్యారం గంలోని అన్ని సమస్యలను పరిష్క రించడానికి తమ ప్రభుత్వం కృతని శ్చయంతో ఉందన్నారు. జడ్చర్ల ని యోజకవర్గంలోని ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుతున్న వేలాది మం ది పేద విద్యార్థులకు అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) బ్రాండెడ్ బూట్లను అందించడం ముదావహమని ప్రశంసించారు. ఈ సందర్భంగానే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినం దించారు.

పాదయాత్రలో మాటిచ్చా: అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) … జడ్చర్ల నియోజక వర్గంలో తాను ఎన్నికలకు ముందు చేసిన ప్రజాహిత పాదయాత్ర చేసిన సమయంలో పేద విద్యార్థులు కాళ్ల కు చెప్పులు కూడా లేకుండా కాలి నడకన పాఠశాలలకు వెళ్లడం చూ సి తాను ఎంతో ఆవేదన చెందానని, అప్పుడే వారందరికీ బూట్లు కొనిస్తా నని హమీ ఇచ్చానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) తెలిపారు. పాదయా త్రలో ఇచ్చిన మాట ప్రకారంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అన్ని తరగతుల విద్యార్థులకు బాటా బూట్లను పంపిణీ చేయనున్నామని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, స్వ చ్ఛంధ సంస్ధల (Industrialists, Voluntary Organizations)సహకారంతో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన విద్యార్థు లకు ట్యాబ్ లను కూడా ఇచ్చే ప్రతి పాదన ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదం డ్రులతో పాటుగా తాండూరు ఎమ్మె ల్యే మనోహర్ రెడ్డి, మహబూబ్ నగర్ డిఇఓ రవీందర్, నాగర్ కర్నూ లు డిఇఓ గోవిందరాజులు, తదిత రులు కూడా పాల్గొన్నారు.