Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Komatireddy Rajagopal Reddy: రాజువయ్యా..మహారాజువయ్యా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై మహి ళల ప్రశంసలు

–బెల్ట్ షాపుల నిర్మూలనకు స్వ చ్ఛందంగా ముందుకు వస్తున్న గ్రామస్తులు
–బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రా మాలకు వెంటనే రూ. 10 లక్షల మంజూరు

MLA Komatireddy Rajagopal Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: నల్లగొం డ జిల్లా మునుగోడు నియోజక వ ర్గం వ్యాప్తంగా ఉదయం మొదలు సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు మద్యపానం ఆలోచన మాను కోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) సంకల్పం నెరవేరుతున్న సంకే తాలు రోజురోజుకు బలపడుతు న్నాయి.మునుగోడు నియోజక వర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపులను నిర్మూ లించాలని మునుగోడు శాసనస భ్యులు కోమటిరెడ్డి రాజగోపా ల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) ఆలోచనకు ఆచరణ రూపం సాక్షాత్కారమవుతోంది.

రాజువ య్య మహారాజువయ్య అంటూ అభినందనల గజమాలలతో గ్రా మాలకు గ్రామాలే కదిలివస్తున్నా యి. గ్రామాలలో బెల్ట్ షాప్ నిర్మూ లన కమిటీలు (Belt Shop Abolition Committees) నిర్వహించుకుని బెల్ట్ షాపులు నిర్వహించకుండా చూస్తున్న క్రమంలో బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలకు అభివృద్ధి ని నిధులు మంజూరు చేస్తున్నారు ఎమ్మెల్యే. మునుగోడు మండలం రావి గూడెంలోబెల్ట్ షాపులు నిర్మూ లించినందుకు కమిటీ సభ్యులను మునుగోడు లోని వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో సన్మానించి అభి నందనలు తెలిపారు. వెంటనే రా విగూడెం గ్రామ అభివృద్ధికి పది లక్షల నిధులు మంజూరు చేశారు. బెల్ట్ షాపులను నిర్మూలించిన కమి టీ మెంబర్లైన మహిళల (womans) అభిప్రా యాన్ని అడిగి తెలుసుకున్నారు. మీరు తీసుకున్న బెల్ట్ షాపుల నిర్మూలన నిర్ణయం వల్ల ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకుంటున్నారని తాగుడు జోలికే వెళ్లట్లేదని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉండడంవల్ల యువత మద్యానికి బానిసై చెడు వైపు వెళ్తున్నారని కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరి స్థితులలో బెల్ట్ షాపులు (velt shops) మూసివే యాల్సిందేనని, ఉదయం నుండి సాయంత్రం వరకు తాగుడు అరిక ట్టాల్సిందేనని తేల్చి చెప్పారు.

గ్రామాల్లో మహిళలు సంతోషం గా ఉన్నారా…
తనను అభినందించేందుకు వచ్చి న గ్రామస్తులను పలుకరిస్తూ బెల్టు షాపులు (Belt Shop)మూసివేసియిచినoదుకు అందరూ సంతోషంగా ఉన్నారా. ముఖ్యంగా మహిళలు సంతోషం గా ఉన్నారా అంటూ ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) అడిగి తెలుసుకు న్నా రు. ఆ వెంటనే వారందరి సమ క్షం లోనే ఇదే తరహా పంథా కొనసాగి స్తూ నియోజక వర్గం వ్యాప్తంగా బెల్టు షాపుల నిర్మూలనకు కంకణ బద్దులమవుదామని పిలుపుని చ్చారు. వెనువెంటనే వారికి రూ. 10లక్షల నిధులు కేటాయించాలని తన సిబ్బందికి సూచిస్తూ సూచిం చారు. ప్రభుత్వం నుంచి కాకున్నా తన సొంత నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టి అభి వృద్ది చేసుకోవాలని సూచించారు.