Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mlc Kavitha bail reject : ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ ఎదురుదెబ్బ

--బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు

ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ ఎదురుదెబ్బ

–బెయిల్ పిటిషన్ ను తిరస్కరిం చిన కోర్టు

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ మ ద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత కు మరోమారు ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ కేసుకు సంబం ధించి ఆమెపై నమోదైన కేసులో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ( mlc Kavitha) బెయిల్‌ ను న్యూఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమ వారం తిరస్కరించింది.

కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో ఆమె బెయిల్‌ ను తిరస్కరిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కవిత న్యూఢిల్లీ లోని తీహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును మొదటగా నమోదు చేసిన సిబిఐ ( cbi ) దర్యాప్తు చేప ట్టింది.

ఆ తరువాత సిబిఐ జారీ చేసిన ప్రథమ సమాచార నివేదిక (fir) ఆధారంగా ఇడి వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించింది. 2024 మార్చి 15న కవి తను బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం నుంచి ఈడీ అరెస్టు చేసి న్యూఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే.

ఈడీ ఆమెను న్యూఢిల్లీ లోని తీహార్ జైలులో ఉంచగా ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. అంతకు ముందు విచారణ ముగియగా ఢిల్లీ మద్యం కేసు లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై సోమవారం తీర్పు వెలువడనుందని అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు.

రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఈ తీర్పు వెలు వరించారు. కాగా లిక్కర్ ఈడి, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించగా ఈడి, సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిసిన నేపద్యంలో సోమవారం కవిత బెయిల్‌పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించనున్నారని తెలియడoతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.

లిక్కర్ కేసులో మార్చి 15 న కవితను ఈడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే తిహాడ్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11 న సీబీఐ అరెస్ట్ చేసిన విషయ ము విధితమే. కాగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సం బంధించి ఈడి, సీబీఐ కేసులో కవిత బెయిల్‌ ( bail ) కోసం గత నెల 22న రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు జరుగ్గా న్యాయమూర్తి కావేరీ బవేజా తొలుత మే 2కు తీర్వు రిజర్వు చేశారు.

అయితే మే 2న తీర్పు వస్తుందని అంతా భావించగా ఈడీ కేసులో బెయిల్‌ పిటిష న్‌పై తీర్పు మే 6కు రిజర్వ్‌ అయ్యింది. ఈ నేపథ్యం లో రెండు కేసుల్లో బెయిల్‌ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తా మని న్యాయమూర్తి స్పష్టం చేసిన క్రమంలో ఈరోజు సదరు తీర్పు వెలువడింది.