MP Chamala Kiran Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మసినట్టే టిపిసిసి నాయ కులు బట్టు జగన్ యాదవ్ పేర్కో న్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. బీజేపీ లో ఉంటూ ఐసీ ఐసిఐ బ్యాంకు లో చేసినా అవినీతి కేసు బయటపడకుండా పదవి కోసం బిఆర్ఎస్ లొకి మారిన అవకాశవాది రావుల అని యువ జన కాంగ్రెస్ ఆల్ ఇండియా జన రల్ సెక్రటరీగా మరియు వివిధ రాష్ట్రాలకు ఇన్చార్జిగా, టిపిసిసి ఉపాధ్యక్షుడిగా, టిపిసిసి మీడి యా కమ్యూనికేషన్ అధ్యక్షుడిగా వివిధ హోదాలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన ఘన చరిత్ర చా బుమల కిరణ్ కుమార్ రెడ్డిదనీ వారి పని తీరును చూసి కాంగ్రెస్ పార్టీ అధి ష్టానం భువనగిరి ఎంపీగా అవకా శం కల్పిస్తే భువనగిరి నియోజ కవర్గ ప్రజల మన్ననలు పొంది రెండు లక్షల యాబై వెయ్యిల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనీ టిపిసిసి నాయకులు బట్టు జగన్ యాదవ్ అన్నారు.
శ్రీధర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగిన బుద్ది చెప్తామని ఆయన హెచ్చరించారు. నాడు బీజేపీ లొ ఉంటూ కిషన్ రెడ్డి మెప్పు కోసం కేటీఆర్ ను నేడు కెటిఆర్ మెప్పు కోసం మెప్పు కోసం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతున్నాడని, కేటీఆర్ అమెరికా లొ అంట్లు తోమిన విషయాన్ని శ్రీధర్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు మోచేతి నీళ్లు తాగుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడి బజారుల నిలబెడుతామన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి పనులు చేయచేతకాక, సంవత్సరంలోనే కాంగ్రెస్ ఇచ్చినా హామీలను నెరవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ చూసి కెటిఆర్ అధికార దాహంతో విమర్శిస్తున్నారు.
చేసిన తప్పు బయటపడంతో జైలు తప్పదని తెలిసి బిఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టేలా లొట్టపిసి కేసు లోటపీస్ ముఖ్యమంత్రి అంటూ హేళనగా మాట్లాడుతున్న కెటిఆర్ ను తెలంగాణా సమాజం అసహ్యించుకుంటుంది. అలాంటి కెటిఆర్ మెప్పు కోసం రావుల శ్రీధర్ రెడ్డి మా ఎంపీ నీ అడ్డగోలుగా మాట్లాడుతూ విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.