MP Etela Rajender: ప్రజా దీవెన, హైదరాబాద్: ముత్యాలమ్మ దేవాలయం (Mutyalamma temple) వద్ద జరిగిన లాఠీచార్జీలో బీజేపీ నాయకులు హత్యాయత్నం చేశారని 109 సెక్షన్ కింద కేసులు పెట్టి బీజేపీ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ (MP Etela Rajender) పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని, కేసులను విత్ డ్రా చేసుకో వాలని డిమాండ్ చేశారు. లేదంటే జరిగే పరిణామా లకు ప్రభుత్వమే బాధ్యత వహిం చాల్సి ఉంటుందని హెచ్చ రించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంత జరుగుతున్నా మేము చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేమని సంకేతాలు పంపిస్తున్నామని గుర్తు చేశారు.
మా ప్రజల పట్ల, సంస్థల పట్ల రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఇంత ద్వేష భావం ఎందుకో సమాధానం చెప్పా లని డిమాండ్ చేశారు. ముఖ్య మంత్రులను దించడానికి మత కల్లోలాలు సృష్టించి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం హిందూ ప్రజల ఆత్మగౌరవం విశ్వాసాన్ని కాపాడడంలో విఫలమైందని విమర్శించారు. దుర్మార్గులను కట్టడం చేయటంలో విఫలమైందని, ఎంఐఎం పార్టీ అప్పిస్మెంట్ కోసం ఇవన్నీ చేస్తున్నారని, ఇప్ప టికైనా జ్ఞానోదయం కలిగి సమాజ హితం కోసం ప్రయత్నం చేయాలి లేదంటే సమాజం, చరిత్ర క్షమించ దని హితవు పలికారు. పోలీసు (police) లతోనే అన్ని కట్టడం చేస్తామని అంటే అది వెర్ర్రిబాగులతనం అవుతుందని ఎద్దేవా చేశారు.