–ఆ అధికారి కారణంగానే అన్నీ సమస్యలు
–టీజీపీఎస్సీ చైర్మన్ తప్పుడు ఆలోచనతోనే అనర్ధాలు
–బీజేపీ ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు
MP Raghunandan:ప్రజా దీవెన, హైదరాబాద్: ఓ రిటైర్డ్ పోలీసు అధికారిని టీజీపీఎస్సీకి చైర్మన్ (Chairman of TGPSC) గా నియమించారని, ఆయ న ఈ ఏడాది డిసెంబర్లో రిటైర్డ్ కాబో తున్నందున ఆలోపు తన హయాం లోనే ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఆయన తప్పుడు ఆలోచన వల్ల హడా వుడిగా పోటీ పరీక్షలు నిర్వ హించాలని చూస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan) ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ కోసం మరో 45 రోజులు సమయం కేటాయించాలని అభ్యర్థులు డిమాండ్ (demand)చేస్తున్నా సర్కారు పట్టిం చుకోవడం లేదన్నారు. ఈ విష యంలోఅభ్యర్థులకు బీజేపీ సంపూ ర్ణంగా మద్దతు ఇస్తుందన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే గ్రూప్-1 పోస్టు లు (Group-1 Posts s) పెంచుతామని, గ్రూప్-2 లో రెం డు వేల పోస్టులు ఇస్తామని, గ్రూప్- 3లో దాదాపు 3 వేల పోస్టులు వేస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నదన్నారు. చదువు కున్న వారికి పరీక్షల విలువ, ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య ఉండా ల్సిన వ్యవధి గురించి తెలుస్తుంద న్నారు.
కాంగ్రెస్ పార్టీ (Congress party)మాటలు కోట లు దాటుతుంటే చేతలు మాత్రం గడప దాటడం లేదని, రాష్ట్రంలోని నిరుద్యో గులకు ఆ పార్టీ చేసిన మోసాలే అందుకు నిదర్శనమని విమర్శించారు. గ్రూప్-1 మెయిన్సు 1:100 అభ్యర్థులను ఎంపిక చేయా లని ప్రతిపక్షంలో ఉండగా ఇదే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిండు సభలో డిమాండ్ చేశారని ఎంపీ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను, నిరు ద్యోగ ఉద్య 3 మాలను కొనసాగించాలని ఈరోజు బీజేపీ రాజకీయ తీర్మానం చేసిందన్నారు. రూ. 4వేల నిరుద్యోగ భృతికి బడ్జెట్ లేదు కానీ ఈ ముఖ్యమంత్రి ఏడు నెలలుగా ప్రతి నెల రూ. 4 లక్షల జీతం తీసుకుంటున్నారని రఘు నందన్ విమర్శించారు.
గతప్రభు త్వ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr)ఆదేశాల మేరకే ఫోన్ భయపడుతున్నదని ట్యాపింగ్ చేశానని ఎస్ఐబీ మాజీ చీఫ్ స్పష్టంగా చెప్పినా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఎంపీ ప్రశ్నించారు. ఇంకేం ఆధా రాలు కావాలని ప్రశ్నించారు. మీకు నచ్చినప్పుడు అస్మదీయులకు ఒక రకంగా, తస్మదీయులకు మరోరకం గా లీకులు ఇచ్చిన ఈ ప్రభుత్వం కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఎందుకు ప్రశ్నించారు. కేసీఆర్ తో పాటు అనేకమంది నాటి మం త్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఆరోపణలు వస్తే వారిని అరెస్టు (arrest)చేయకుండా వారు పార్టీ మారాలని బేరం అని నిల దీశారు.