Tahasildar: తహశీల్దార్లను పాత జిల్లాలకు పంపించాలి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ అయిన తహశీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు పంపించాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌ను తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) కోరింది.
ఎన్నికల సమయంలో సీసీఎల్ ఏకు తెలంగాణ తహశీల్దార్స్ అసో సియేషన్ వినతి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Telangana Assembly Elections)ముందు ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ అయిన తహశీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు పంపించాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌ను తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) కోరింది. ఈ మేరకు టీజీటీఏ ప్రతినిధులు గురువారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఒకే జిల్లాలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలంగా పని చేస్తున్న, సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్లను బదిలీ చేయాల్సిందిగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ ఆదేశించినట్టు తెలిపారు. ఈ మేరకు అనేకమంది తహశీల్దార్లు(Tahsildars)వారు పని చేస్తున్న జిల్లాల నుంచి చాలా దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీరంతా పిల్లల చదువులు, తల్లిదండ్రుల వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా కుటుంబా లను తాము పని చేస్తున్న దూర ప్రాంతాలకు తీసుకెళ్లలేక పోతు న్నట్టు వివరించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్ల మెంటు ఎన్నికలు కూడా ముగి సినందున తహశీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
2009 ఎన్నికల నుంచి ఇలా ఎన్నికల(Election) ప్రక్రియలో భాగంగా బదిలీ అయిన తహశీల్దార్లను ఎన్నికలు పూర్తి కాగానే తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేస్తున్న విషయాన్ని సీసీఎల్ఏ(CCLA) దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా తహశీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు.పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు.కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. రాములు, జనరల్ సెక్రటరీ పాక రమేష్,(General Secretary Paka Ramesh)సెక్రటరీ, జనరల్ పూల్ సింగ్ చౌహాన్, మహిళా ప్రెసిడెంట్
రాధా, ట్రెజరర్ శ్రీనివాస్ శంకర్,
తహసీల్దార్లు ఇలియాస్ అహ్మద్, పుష్యమి, లావణ్య, శంకర్, శ్రీదేవి, సరిత, విశ్వనాద్, టి భీమయ్య, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
MRO reposting to Old districts