Murder: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో దారుణ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కారణాలు ఏమైనప్పటికీ పట్టపగలే హత్యలు జరుగుతుండడo ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నా యి. తాజాగా అలాంటి ఘటనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగింది. పట్టపగలే ఓ కుమారు డు తన తండ్రిని విచక్షణ రహితం గా కత్తితో పొడిచి హత్య చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం మేడ్చల్ జిల్లా కుషాయి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాప్ వద్ద తండ్రిపై కు మారుడు దారుణంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు.బస్టాప్ వద్ద ఉన్న తండ్రిపై దాడి చేసి సుమారు ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడవ డం తో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని పక్కనే ఉన్న శ్రీకర ఆ సుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.సమాచారం అందు కున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తండ్రి మొగిలి మద్యానికి బానిసై రోజు ఇంట్లో గొడవ చేస్తున్నాడని విసిగి వేసారిన కుమారుడే ఈ దారుణానికి పాల్ప డ్డట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కూడా మొగిలి హత్యకు కారణాలు గా పోలీసులు గుర్తించారు.
నిందితుడు సాయి(25) హత్య చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి, మృతుడు సికింద్రాబాద్ లాలా పేటకు చెందిన ఆర్ఎల్ మొగిలిగా, నిందితుడిని అతని కుమారుడు సాయి కుమార్గా గుర్తించారు.కేసు నమోదు చేసు కున్న పోలీసులు దర్యాప్తు చేపట్టా రు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తర లించారు.