Murder: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణ హత్య (Murder)సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న హనుమ హాస్టల్లో వ్యక్తి దారుణ హత్య జరిగింది.ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్ పై కత్తి తో దాడి (Attack with a knife)చేసి హత్య (Murder) చేశారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే..హెయిర్ కట్ షాప్ లో పని చేసే బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ ఒకే షేరింగ్ రూమ్ లో నివాసం ఉంటున్నారు. గణేష్ రోజూ మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ చెలరేగింది.
వెంకటరమణ పై గణేష్ కటింగ్ షాప్ లో (Cutting shop) ఉపయోగించే కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. దాంతో రక్తపు మడుగులో వెంకటరమణ సంఘటన స్థలంలోని తుది శ్వాస విడిచాడు.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు,కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకటర మణ కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ నివాసిగా పోలీసులు గుర్తిం చారు. ఇది ఇలా ఉంటే ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు (police)అనుమానాలు సదరు కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.