JP Nadda: ముస్లింల రిజర్వేషన్ లతో ముసలం పెట్టిందే కాంగ్రెస్
రాజ్యాంగంలో అవకాశం లేని మత పరమైన రిజర్వేషన్ లకు ఆజ్యం పోసిన కాంగ్రెస్ ముస్లీం రిజర్వేష న్లతో ముసలం పెట్టిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో మండిప డ్డారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టింది
శ్రీరాముడికి, సనాతన ధర్మానికి కాంగ్రెస్ బద్ద వ్యతిరేకి
ప్రధాని మోదీ పాలనలో అగ్ర గామిగా భారత్
నల్లగొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బిజెపి అద్యక్షుడు జేపీ నడ్డా
ప్రజా దీవెన, హైదరాబాద్: రాజ్యాంగంలో అవకాశం లేని మత పరమైన రిజర్వేషన్ లకు ఆజ్యం పోసిన కాంగ్రెస్ ముస్లీం రిజర్వేష న్లతో ముసలం పెట్టిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా(JP Nadda) తీవ్ర స్థాయిలో మండిప డ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వే షన్లలో కోత విధించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్(Congress) పార్టీయేనని పునరుద్ఘాటించారు. సోమవారం పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, నల్ల గొండలో జరిగిన జన సభల్లో నడ్డా మాట్లాడారు.
దొడ్డి దారిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు గండి కొట్టలేదని రాతపూర్వకంగా రాసి స్తారాఅని ప్రధాని మోదీ కాంగ్రెస్‌కు సవాల్ విసిరితే ఆ పార్టీ నోరు మెద పడం లేదని గుర్తు చేశారు. రిజ ర్వేషన్ల విషయంలో రాహుల్ గాoధీ తప్పు డు మాటలు మాట్లాడుతు న్నారని, దళిత, ఆదివాసీ, బీసీలను దగా చేస్తున్నారని విమర్శించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని అంబేడ్కర్(Ambedkar)రాజ్యాంగంలో స్పష్టం చేశారని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల రిజర్వేషన్లు వారికే చెందాలనే సంకల్పంతోమైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్ని స్తోందని తెలిపారు. కర్ణాటకలో(Karnataka) బీజేపీ సర్కారు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసిందని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ముస్లిం లీగ్, తబ్లీగీ జమాత్ ఎజెండాను అనుసరిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాముడికి, సనాతన ధర్మానికి వ్యతిరేకమని విమర్శించారు. కాంగ్రెస్ జమానాలో అవినీతి, పాలసీలు తయారు చేయలేని అచేతనమైన పాలన కొనసాగిందని విమర్శించారు. మోదీ పాలనతో దేశం స్వయం సమృద్ధిని సాధించి ప్రపంచంలోనే అగ్రగామిగా రూపొం దిందని పేర్కొన్నారు. 2014లో ప్రపంచ జీడీపీలో(GDP) 11వ స్థానంలో ఉన్న దేశాన్ని మోదీ సర్కారు ఐదో స్థానంలోకి తీసుకువచ్చిందన్నారు. ఫార్మా రంగంలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న భారత్ నాణ్యమైన మందులను చౌక ధరకే అందిస్తోం దని నడ్డా పేర్కొన్నారు.
Muslims reservations is not correct