–నాగార్జునసాగర్‌లో 20 గేట్ల నుం చి దిగువకు విడుదల
–దిగువకు 1,96,027 క్యూసెక్కులు 584.80 అడుగుల వద్ద సాగర్ నీటి మట్టం
–ఎగువ నుంచి వస్తున్న 3.75 లక్షల క్యూసెక్కులు
–ఎగువ ప్రాజెక్టులన్నీ గేట్లనూ తెరిచి దిగువకు వదులుతున్న నీరు
Nagarjuna Sagar:ప్రజా దీవెన, హైదరాబాద్: కృష్ణ బేసిన్ లో (Krishna Basin)కొద్దిరోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు భారీ గా వస్తున్న వరదతో ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇంకా నిలకడగా వరద వచ్చిచేరు తుండటంతో ఆల్మట్టి నుంచి నాగా ర్జునసాగర్ దాకా ప్రాజెక్టుల గేట్లన్నీ తెరిచి ఉంచారు. ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు ఇప్పటికే తెరుచుకొని ఉం డగా నారాయణపూర్ ప్రాజెక్టుకు (Narayanpur Project) చెందిన 25 గేట్లు, ఉజ్జయిని ప్రాజెక్టు గేట్లు16, జూరాల ప్రాజెక్టుకు గేట్లు 34 , శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు, నాగార్జునసాగర్‌కు చెందిన 20 గేట్లను తె రిచి ఉంచారు. సాగర్‌లో ఉదయం 10గంటలకు ప్రాజెక్టు సీఈ నాగేశ్వ ర్‌రావు ప్రధాన డ్యాం క్రస్ట్ గేట్లపై 13వ నంబరు గేటు వద్ద ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత మొత్తం 6 గేట్ల ను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యా హ్నం నల్లగొండ జిల్లా కలెక్టర్ నారా యణరెడ్డి గేట్లపైస్విచ్ఛాన్ చేసి మరో 4 గేట్లను ఎత్తారు.
మధ్యా హ్నం 3 గంటల సమయంలో 10 క్రస్ట్ గేట్లను (10 crust gates) 5 అడుగుల మేర ఎత్తి 73,630 క్యూసెక్కుల నీటిని దిగువ కు విడుదల చేశారు. ఎగువనుంచి వరద రాక స్థిరంగా కొనసాగుతుం డటంతో సాయంత్రం 5 గంటలకు మరో 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు మరో రెండు గేట్లు, రాత్రి 10 గంటలకు మరో 4 గేట్లు ఎత్తారు. దీంతో మొత్తం 20 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,50,580 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు (Sagar project)పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, సోమవారం రాత్రి 10 గంటలకు 584.80 అడుగులుగా ఉంది. కుడికాల్వ ద్వారా 8,221 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 6.325 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 600 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,501 క్యూసెక్కులు, 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,50,590 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ నుంచి మొత్తం 1,96,027 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. కాగా, ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు రెండు గేట్లనుంచి 32,390 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు(45.77 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 131.88 అడుగులుగా (7.10 టీఎంసీలు) నమోదైంది. ప్రాజెక్టుకు 67,112 క్యూసెక్కుల వరద వస్తోంది.
శ్రీశైలంకు వరద తగ్గుముఖం
శ్రీశైలం ప్రాజెక్టుకు (For Srisailam project)వరద తగ్గుతు న్నది. సోమవారం డ్యాం సైట్ వద్ద 3,44,218 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతుండగా సోర్స్ ప్రాజెక్టులైన జూరాల, సుంకేశుల నుంచి 3,69,067 క్యూసెక్కుల వరద విడుదలవుతోంది. వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయం గేట్ల ఎత్తును కూడా తగ్గించారు. పది గేట్లు 12 ఫీట్ల మేరకు ఎత్తి 3,10,840 క్యూ సెక్కులను, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,857 క్యూసె క్కులు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్ప త్తి ద్వారా 26,481 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.ఎగువన ఉన్న జలాశయాలకు వరద తగ్గుముఖం పడుతుండటంతో ఖాళీ చేసిన జలాశయాల్లో (In reservoirs)క్రమంగా నిల్వలను పెంచుకుంటున్నారు. ఈ నెల 3న ఆల్మట్టిలో 72.89 టీఎంసీలుండగా… సోమవారం 83.91 టీఎంసీలకు చేర్చారు. నారాయణపూర్‌లో 28.88 టీఎంసీలుండగా.. 31.93 టీఎంసీలకు చేర్చారు. తుంగభద్రలో 98.26 టీఎంసీలుండగా.. 100.52 టీఎంసీలకు పెంచుకున్నారు. కృష్ణా క్యాచ్‌మెంట్ ఏరియాలో కృష్ణా ఉపనది ఘటప్రభకు భారీగా వరద వస్తుండగా, పంచగంగా నుంచీ భారీగానే వరద వచ్చిచేరుతోంది. మహారాష్ట్ర భీమానదిపై ఉజ్జయిని ప్రాజెక్టుకు 2.05 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1.27 లక్షల క్యూసెక్కులను కిందకు వదిలారు. పుణె, కొల్హాపూర్‌లో (Pune, Kolhapur) వర్షాలతో ఈ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది.