Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nagarjuna: అక్కడ నాగార్జున పై కంప్లైంట్‌..?

Nagarjuna: తాజాగా అక్కినేని నాగార్జున పై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌ చేసినట్టు తెలుస్తుంది. నగరంలోని తమ్మిడికుంట చెరువు కబ్జా చేసి Nకన్వెన్షన్‌ నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారాం. మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి (Kasireddy Bhaskara Reddy) చేశారు. అలాగే నటుడు నాగార్జునపై (Nagarjuna)క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పోలీసులను భాస్కరరెడ్డి కోరినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా లీగల్‌ (Legal) ఒపీనియన్‌కు పంపించారు. మాదాపూర్‌ పోలీసులు. నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌‌ను ఇటీవలే కూల్చివేసిన సంగతి అందరికి తెలిసిన విషయం . ఇటీవలే చెరువును కబ్జా చేసి N కన్వెన్షన్‌‌ నిర్మించారని హైడ్రా దాన్ని కూల్చివేసింది.

అయితే చాల రోజుల నుంచి తుమ్మిడికుంట చెరువులో (Thummidikunta pond) 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి N కన్వెన్షన్ కట్టారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా దాని పై హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు రావడం గమనార్థకం . ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా (hydra) కమిషనర్ రంగనాథ్.. చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి..కూల్చివేతలకు ఆదేశాలు కూడా జారీ చేసారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. జంబో జేసీబీలతో కన్వెన్షన్‌ను గంటల వ్యవథిలోనే నెల మట్టం చేశారు అధికారులు

ఇక ఈ సంఘటనపై నటుడు నాగార్జున (Nagarjuna)స్పందిస్తూ.. ఆ భూమి పట్టా భూమి అని.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణ కట్టడం జరగలేదు అని అన్నారు.. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిదని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలియచేసారు . తాజాగా ఇప్పుడు మరోసారి నాగ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కసిరెడ్డి భాస్కరరెడ్డి. మరి దీని పై నాగార్జున (Nagarjuna) ఎలా స్పందిస్తారో చూడాలి మరి . మరోవైపు మంత్రి కొండా సురేఖ సమంత, అక్కినేని ఫ్యామిలీ పై కామెంట్స్ వైరల్ అవుతున్న సంగతి అందరికి విదితమే. ఈ క్రమంలో కొండా సురేఖ పై నాగ్ లీగల్ యాక్షన్ కు కూడా సిద్ధం అయ్యారు.