బీజేవైఎం నాంపల్లి మండల శాఖ అధ్యక్షులు నాంపల్లి సతీష్
Nampally Satish: మునుగోడు ప్రజా దీవెన అక్టోబర్ 23. పేద విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం నాంపల్లి మండల శాఖ అధ్యక్షులు నాంపల్లి సతీష్ అన్నారు ఆయన మంగళవారం రోజున ప్రజా దీవెన తో మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ (Reimbursement of Fees) మరియు స్కాలర్షిప్లు. విడుదల చేయని కారణంగా సుమారు 7500 కోట్ల రూపాయలు పైగా పెండింగ్లో ఉన్నాయని నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావస్తున్న పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు విద్యార్థుల జీవితాల పట్ల శాపంగా మారారని అన్నారు పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
స్కాలర్షిప్ (Scholarship) ఆధారంగా నడుస్తున్న కళాశాలలో వందల సంఖ్యలో ఉన్నాయి మధ్యలోనే కళాశాల యాజమాన్యాలు చేతులెత్తే పరిస్థితి కల్పిస్తుంది. ఇటు యాజమాన్యానికి అటు ప్రభుత్వానికి మధ్యలో నలిగిపోయేది విద్యార్థుల జీవితాలేనని డిగ్రీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ రాక ఒకవైపు ఉన్నత విద్యకు మరొకవైపు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా సర్టిఫికెట్ లేని కారణంగా విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడుతున్నాయని చెప్పారు సంవత్సరాల తరబడి అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్న అనేక కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లు లేదని విమర్శించారు ఇప్పటికైనా పెండింగ్ స్కాలర్షిప్లు (Scholarship) విడుదల చేయాలని డిమాండ్ చేశారు నేను ఎడల బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు