NDA Alliance:ఎన్డీఏ ఆధిపత్యం
దేశ వ్యా ప్తంగా ఎన్డీఏ కూటమి ఆదిపత్యం కొనసాగిస్తోంది. ఇస్ బార్ చార్జ్ పార్ అనే స్లోగన్ బరిలోకి దిగినా 300 సీట్లకు దగ్గర దగ్గరకు వచ్చినా మొత్తానికి ఎదురీదుతోంది.
అంచనాలకు మించి గట్టి పోటీ నిస్తున్న ‘ఇండియా ‘
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాస్తా అటు ఇటు
ఉత్తర్ ప్రదేశ్ లో ఉనికిచాటుకున్న బిజెపి, పుంజుకున్న సమాజ్ వాది
ఏపీలో ఎంపీ, అసెంబ్లీ రెండిట్లో విజయ పరంపరలో ఎన్డీఏ కూటమి
తెలంగాణలో నువ్వా నేనా అన్న ట్లు పోటీలో కాంగ్రెస్, బీజేపీ
ప్రజా దీవెన హైదరాబాద్: దేశ వ్యా ప్తంగా ఎన్డీఏ కూటమి ఆదిపత్యం కొనసాగిస్తోంది. ఇస్ బార్ చార్జ్ పార్ అనే స్లోగన్(The slogan Is Bar Charge Par)బరిలోకి దిగినా 300 సీట్లకు దగ్గర దగ్గరకు వచ్చినా మొత్తానికి ఎదురీదుతోంది. ఉద యం 10 గంటల సమయానికే బీజే పీ సొంతంగా 230 స్థానాల్లో ముం దంజలో ఉండగా కూటమి పార్టీల న్నీ కలిపి దాదాపు 295 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ వస్తున్నాయి. ఇదే సందర్భంలో గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి అదే సమయా నికి భాగస్వామ్య పక్షాలతో కలుపు కొని 220 స్థానాల్లో ఆధిక్యం కొనసా గిస్తుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి(Alliance of India)దాదాపు 90 స్థానాల వరకు ఎక్కువ పట్టు సాధిం చింది. ఎన్డీఏ టీమ్ మాత్రం గతంతో పోలిస్తే దాదాపు 50 స్థానాల వరకు వెనకబడింది. దేశంలోనే అత్యధిక స్థానాలున్న ఉత్తరప్ర దేశ్ లో గత ఎన్నికల్లో 62 స్థానాలు గెల్చుకున్న బీజేపీ(BJP) ఈసారి మాత్రం 40 ఫిగర్ దాటడం కష్టంగా మారింది, ఈ దఫా సమాజ్ వాది పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రా ల్లో బీజేపీ ప్రభావం గణనీయంగా పడిపోయింది. మరోవైపు తెలంగా ణాలో కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతూ చెరిసగం స్థానాల్లో ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం వైసీపీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేసిన టీడీపీ కూటమి ట్రెండ్స్ లో దూసుకుపో తోంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కిందా పైనా..ఎగ్జిట్ పోల్స్(Exit polls)అంచనాలు దేశవ్యాప్తంగా తారుమార య్యా యనే చెప్పాలి. ఎన్డీఏ కూటమి 400 మార్కు దాటుతుందని పలు జాతీయ మీడియా వానెళ్లు, సంస్థ లు పేర్కొన్నాయి. కానీ ఎన్టీఏ కూట మి మొత్తం కలిపి 300 సీట్లు దాటి నా 400 మైలురాయిని చేరు కునే పరిస్థితి మాత్రం కనబడడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లు గానే ఫలితాలు వస్తున్నాయి. తెలం గాణలో కాంగ్రెస్, బీజేపీ చెరి సగం స్థానాలను చేజిక్కించుకోగా ఉత్తర భారతంలో బీజేపీ గతంతో పోలిస్తే ప్రభావాన్ని కోల్పోయింది. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ(BJP) గతంలో గెల్చు కున్న సీట్లలో 28 చోట్ల వెనకబడి ఉండగా సమాజ్ వాది మాత్రం 36 స్థానాలను అదనంగా సంపాదిం చుకునే దిశగా అంచనాలు వెలువ డుతున్నాయి. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తో బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటున్నది.
పంజాబ్ లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇండియా టీమ్ గా పోటీ చేస్తుండ డంతో వర్కౌట్ అయినట్లు అంచ నాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ వెనకబడింది. గుజరాత్లో గత ఎన్నిక ల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి నాలుగు స్థానాల్లో ఓటమి దిశగా ప్రయాణిస్తున్నది. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను గెల్చుకున్న బీజేపీ ఈసారి రెండు చోట్ల వెనబ డింది. అక్కడ మ్ ఆద్మీ పార్టీ బలప డినట్లు అంచనాలు వెల్లడిస్తున్నా యి. కాగా ఆంధ్రప్రదేశ్ లో(Andhra Pradesh)మాత్రం వైసీపీని తెలుగుదేశం పార్టీ ఒంటరి గానే సింగిల్ డిజిట్ కు పరిమితం చేసింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్, కాయుదేలీలో ముందంజలో ఉండగా సిట్టింగ్ స్థానం గా ఉన్న అమేధిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ వెనకబడ్డారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దూకుడుకు సమాజ్ వాదీ పార్టీ అడ్డుకట్ట వేసిం ది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలేవీ ఎస్సీ ప్రభావాన్ని సరిగ్గా లెక్కించలేకపో యాయి.
ఏది ఏమైనా బిజెపి హవా కొనసాగుతోంది… ఎన్నికల ఫలి తాల్లో దేశవ్యాప్తంగా మరోసారి బీజేపీ హావా కొనసాగుతుండగా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చెరిసగం సీట్లలో ఆదిత్యంలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు గాను కాం గ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 స్థానాల్లో ముందంజలో కొనసా గుతున్నాయి. ఇటీవలే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఆ పార్టీకి ఇప్ప టివ రకు కేవలం మెదక్ స్థానంలో మాత్ర మే తొలుత కొంత అధిక్యం లభిం చగా మిగతా నియోజకవర్గాల్లో చతికిలపడిపోయింది. పలు నియోజకవర్గాల్లో హోరాహోరీ .. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ సర్సెస్ బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది..
సికింద్రాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, దేశంలోనే అదిపెద్ద లోక్ సభ స్థానమైన మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్,(Etala Rajender)కరీంనగ ర్ లో బండి సంజయ్, నిజామా బాద్ లో బీజేపీ అభద్ధి దర్శపుని అర్వింద్, మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, నాగర్ కర్నూల్ లో బిజెపి అభ్యర్థి భరత్, ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ ఆధిక్యంలో ఉన్నారు. చేవెళ్లలో బీజేపీ, అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. నల్లగొండ స్థానంలో కాంగ్రె స్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఖమ్మం అభ్యర్థి రామనహాయం రఘురామ్ రెడ్డి,(Raghuram Reddy)భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చాలు కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య జహీరాబాద్ లో కాంగ్రెస్ క్యాండిడే ట్ సురేశ్ షెట్కార్, మహబూబా బా ద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, హైదరాబాద్ లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మెదక్ లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆదిత్య కొనసాగిస్తున్నారు. ఇందు లో మల్కాజ్గిరి నిజామాబాద్ కరీంbనగర్ ఫలితాలు బిజెపి అభ్య ర్థులు గెలుపొందినట్లు ప్రకటిం చారు.
NDA alliance wins in parliament elections