–సుప్రీంకోర్టు తీర్పు అది దాటోద్ధని సూచిస్తుంది
–65 శాతానికి పెంచుతూ బిహార్ సర్కారు నిర్ణయాన్ని కొట్టేసిన పా ట్నా హైకోర్టు
ప్రజా దీవెన, పాట్నా: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వే షన్లను 65 శాతానికి పెంచుతూ నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం (Bihar Govt) తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది. రిజర్వే షన్లు 50% దాటరాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం భిన్నంగా ఉండ టంతో జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నితీశ్ సర్కారు (Nitish Kumar) రాష్ట్రవ్యాప్తంగా కుల గణన చేపట్టి, వాటి ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీల రిజర్వే షన్లను (Reservations) పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది నవంబరు 21న రిజర్వేషన్లను 50% నుంచి 65 శాతానికి పెంచుతూ గెజిట్ నోటి ఫికేషన్ జారీ చేసింది. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు పదిశాతంతో కలిపితే రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16లను రిజర్వేషన్‌ల పెంపు నిర్ణయం ఉల్లంఘిస్తోందంటూ పలు వురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. హైకోర్టు (highcourt) గత మార్చిలో ఇరు వర్గాల వాదనలు విని తీర్పును వాయిదా వేసింది. గురువారం పిటిషనర్ల వాదనను హైకోర్టు సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లను కొట్టేసింది. చట్టం ముందు అందరూ సమానులే(ఆర్టికల్14), సమాన అవకాశాలు(ఆర్టికల్ 16) అనే రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘ నకు గురైనట్లు హైకోర్టు అంగీకరిం చింది. కులగణన ఆధారంగా రిజ ర్వేషన్లను పెంచామన్న వాదనను హైకోర్టు అంగీకరించలేదు. తాము జనాభాలో కులాల శాతాన్ని బట్టి రిజర్వేషన్ పెంచలేదని, తగిన ప్రాతినిధ్యం లభించని కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకే రిజర్వే షన్లను పెంచామని ప్రభుత్వ న్యా యవాది వాదించారు. ఈ వాదనను పిటిషనర్లు తోసిపుచ్చారు. కులాల శాతాన్ని బట్టే పెంచారని పిటిషనర్లు అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేష న్లు 10% కల్పించినపుడే 50% దాటి నందున తాము కొత్తగా ఏమీ సుప్రీం తీర్పును ఉల్లంఘించలేదన్న ప్రభు త్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చిం ది.
తమిళనాడులో (tamilnadu) 50 శాతo పైగా …రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని 1992లో ఇం ద్రా షానే కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకు భిన్నంగా తమిళ నాడులో ఎప్పటి నుంచో 69% రిజ ర్వేషన్లు అమలవుతున్నాయి. తమి ళనాట దశాబ్దాలుగా అమలవుతు న్న రిజర్వేషన్లను కాపాడేందుకు అప్పట్లో కేంద్రం తమిళనాడు రిజ ర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చింది. తొమ్మిదో షెడ్యూల్‌లోని అంశాలపై న్యాయ సమీక్షకు అవ కాశం లేదు. దాంతో కొన్నాళ్లపాటు సుప్రీంకోర్టు తమిళనాడు రిజర్వేషన్ల జోలికి పోలేదు. తర్వాత కాలంలో సుప్రీంకోర్టు (Supreme Court) తొమ్మిదో షెడ్యూల్‌లోని అంశాలనూ అవసరమైతే సమీక్షి స్తామని స్పష్టం చేసింది. దాంతో తమిళనాడు రిజర్వేషన్లపై అనేక పిటిషన్లు దాఖలై సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. 50% నిబంధన వచ్చిన తర్వాత మహారాష్ట్రలో మరాఠాల కోసం, రాజస్థాన్, హరియాణాల్లో జాట్‌ల కోసం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచే ప్రయత్నం చేయగా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు తాజాగా కుల గణన ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచేందుకు బిహార్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని అక్కడి హైకోర్టు కొట్టేసింది. తాము అధికారానికి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి, వాటి ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామని ఇండీ కూటమి హామీ ఇచ్చిన నేపథ్యంలో బిహార్ హైకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.