Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Norovirus: విజృంభిస్తున్న విష జ్వరాలు

–హైదరాబాద్‌‌లో విజృంభిస్తున్న నార్వాక్‌ వైరస్‌
–చిన్నపిల్లలు, వృద్దులపై త పెను ప్రభావం
–పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషిత ఆహారంమే కారణం
–నిలోఫర్‌కు క్యూ కడుతున్న నార్వాక్‌ బాధితులు బాధితులు
–అజాగ్రత్త వహిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యు ల హెచ్చరిక

Norovirus::ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌‌లో విజృంభిస్తున్న నార్వాక్‌ వైరస్‌ (Norovirus)తో నిలోఫర్‌కు క్యూ కడుతున్న బాధితులతో నిండిపో తోంది. చిన్నపిల్లలు, వృద్దులపై తీవ్ర ప్రభావం చూపుతూ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని నిలో ఫర్‌ ఆస్పత్రికి (Nilofar Hospital)నార్వాక్‌ బాధితులు క్యూ కడుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరి ముఖ్యంగా చిన్నారుల విష యంలో చాలా జాగ్రత్తలు తీసుకో వాలంటున్నారు. పరిసరాలు, వ్యక్తి గత పరిశుభ్రత లేకపోవడం, కలుషి త ఆహారం, కలుషిత నీళ్లు తీసుకో వడం వల్ల ఈ వైరస్‌ ప్రబలుతుం దంటున్నారు వైద్యులు. తీవ్రమైన డీహైడ్రేషన్, నిస్సత్తువ, ఏం తినలే ని పరిస్థితి ఉంటే మాత్రమే ఆసుప త్రిలో చేర్పించి చికిత్స అందించా లని చెబుతున్నారు.వర్షాకాలం వచ్చేసింది. సీజనల్ వ్యాధులు ఓ రేంజ్ లో విజృంభిస్తున్నాయి. ఓ వైపు డెంగ్యూ తో (Dengue) జనం ఇబ్బంది పడుతుంటే మరోవైపు నార్వాక్‌ వైరస్‌ నరకం చూపిస్తోంది. చిన్నారులు, వృద్ధులే Children and old people)టార్గెట్‌గా విజృంభిస్తోంది. అసలింతకీ ఏంటి నార్వాక్‌ వైరస్, ఈ వైరస్‌ లక్షణాలు ఎలా ఉంటాయో నార్వాక్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటని వైద్యులు అందజేసిన సమాచారం మేరకు తెలుసుకుందాం.

రాష్ట్రంలో వాతావరణ (weather)అసమతుల్యత… రాష్ట్రవ్యా ప్తంగా వర్షాలు దంచికొడుతున్నా యి. వర్షాలతో పాటు కొత్తరకం వైరస్‌లూ రంగప్రవేశం చేసి జనా లపై దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం నార్వాక్‌ వైరస్‌ నరకం చూపిస్తోంద నడంలో ఇటువంటి అతిశయోక్తి లేదు. నార్వాక్ బాధితులతో హైద రాబాద్‌ నిలోఫర్‌ హాస్పిటల్‌ నిండిం ది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగి స్తుండగా నగరంలో నార్వాక్‌ వైరస్ బెంబేలెత్తిస్తోంది. సాధారణంగా వానాకాలంలో వ్యాప్తి చెందే ఈ వైరస్ చిన్నపిల్లలు, వృద్దులే టార్గె ట్‌గా విజృంభిస్తోంది. దీంతో వంద లాది మంది చిన్నారులు, వృద్దులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, డీ హైడ్రేషన్‌, కడుపులో వాపు, తల నొప్పి, ఒళ్లు నొప్పులతో హాస్పిట ల్స్‌కి క్యూ కడుతున్నారు. బాధి తుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం మరింత ఆందోళన కలి గిస్తోంది.

గత కొన్నిరోజులుగా హైద రాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి (Nilofar Hospital నార్వాక్‌ బాధితులు క్యూ కడు తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటె ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరి ముఖ్యంగా చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలం టున్నారు.పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు తీసుకోవ డం వల్ల ఈ వైరస్‌ ప్రబలుతుం దంటున్నారు వైద్యులు. తీవ్రమైన డీహైడ్రేషన్, నిస్సత్తువ,(Dehydration, lethargy,) ఏం తిన లేని పరిస్థితి ఉంటే మాత్రమే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని చెబుతున్నారు. వైరస్‌ (viruas)బారిన పడిన 12 నుంచి 48 గంటలలోపు లక్షణాలు బయ టపడతాయంటున్నారు. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది కాబట్టి ఈ వాన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరి స్తున్నారు. ఏది ఏమైనా వర్షకాలం పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త పడకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తు న్నారు.