–మహమ్మారితో అప్పుల్లో కూరు కుపోయి ఆత్మహత్య
–హైదరాబాద్ నగరంలో దారుణ సంఘటన
Online Betting: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ (Online Betting ), ట్రేడింగ్ వ్యసనం (
Trading Addiction)ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబాన్ని ఆనకొండలా మింగేసింది. మహ మ్మారి మయాజాలానికి కుటుంబం బలి అయ్యింది. మూడేళ్లు 11 ఏళ్ల వయస్సు ఉన్న అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల భవి ష్యత్తును మింగేసింది. ఆన్‌లైన్ ట్రేడింగ్, బెట్టింగ్‌కు బానిసై అప్పు ల్లో కూరుకుపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) తన భార్య, ఇద్దరు కుమా రులను చంపి ఆ తర్వాత ఉరి వేసుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని గాజులరామారం ప్రాంతంలో జరిగింది. మంచిర్యాల కు చెందిన ఇప్ప వెంకటేష్ (40)కు భార్య వర్షిణి(33), కుమారులు రిషికాంత్ (11), విహాంత్ (3) ఉన్నారు. కోకాపేట్‌లోని లెగోటో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వెంకటేష్ భార్యా పిల్లలతో కలిసి గాజులరామారం, బాలాజీ లే అవుట్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో నివాసముంటున్నాడు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌తోపాటు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన వెంక టేష్ తెలిసిన వారి దగ్గర మాత్రమే కాక లోన్ యాప్‌ల్లోనూ రుణాలు తీసుకున్నాడు. అన్నింటిలోనూ నష్టపోయి రూ.25లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయాడు. చేసి న అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించ లేక మానసికంగా కుంగిపో యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు సిద్ధమ య్యాడు.
కన్న పిల్లలను తన చేతుల తోనే… తాను లేకపోతే భార్యా పిల్లలు రోడ్డున (raod) పడతారనే భావ నతో ముందుగా వారిని హత్య చేసి ఆపై గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి వెంకటేష్ తన భార్య, ఇద్దర పిల్లలను హత మార్చినట్టు పోలీసులు ప్రాథమి కంగా అంచనా వేశారు. కాగా, అప్పుల బాధ (debt pain) తాళలేక తామంతా ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో వెంకటేష్ తన తండ్రి ఫోన్‌కి (Father’s phone) మెసేజ్ పెట్టాడు. ఉదయం 3.30 గంటల ప్రాంతంలో ఆ మెసేజ్ చూసిన వెంకటేష్ తండ్రి కుమారుడు నివసిస్తున్న అపార్ట్ మెంట్ వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి అప్ర మత్తం చేసినా ఫలితం లేకపోయిం ది. ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో ఇరుగుపొరుగు వారు తలుపులు పగలకొట్టి ఇంట్లోకి వెళ్లి చూసే సరికి కుటుంబం అంతా విగతజీవులై పడి ఉన్నారు. విష యం తెలిసి ఘటనా స్థలికి చేరుకు న్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటేష్ తన భార్య, ఇద్దర కుమా రులకు విషం ఇచ్చి చంపాడా లేదా దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హతమార్చాడా అనేది తేలా ల్సి ఉందని పోలీసులు (police)పేర్కొన్నా రు.