Drinking water problems: ఓయు వైస్ ఛాన్సలర్ ఆగ్రహం
ఉస్మానియా యూనివర్సిటీ లో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని పలు పత్రికలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి జలమండలి వివరణ ఇచ్చింది.
తాగునీటి ఇబ్బందులపై వార్డెన్ కు చివాట్లు
మరింత నీటి సరఫరాకు సంసి ద్దమంటున్న జల మండలి
ప్రజా దీవెన, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని పలు పత్రికలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి జలమండలి వివరణ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఉస్మా నియా విశ్వ విద్యాలయంలో తాగు నీటి సరఫరా సక్రమంగా లేదని పలు పత్రికలతో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కథనాలు ప్రచురితం అయిన విషయం తెలి సిందే.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కి జలమండలి రెండు సోర్సుల ద్వారా తాగు నీరు సరఫ రా చేస్తోంది. ఓ అండ్ ఎం డివిజన్ 7 పరిధిలోని తార్నాక, ఓ అండ్ ఎం డివిజన్ 5 పరిధిలోని అడిక్ మెట్ సెక్షన్ల నుంచి నీటి సరఫరా జరుగు తోంది. క్యాంపస్ కు ఒప్పందం ప్రకా రం 200 ఎంఎం డయా పైపులైన్ ద్వారా 455 KLD నీరు సరఫరా చే యాలి కానీ జలమండలి ప్రస్తుతం 1194 KLD నీరు సరఫరా చేస్తోంది.
ఇదే కాకుండా, అడిక్ మెట్ నుంచి 100 ఎంఎం డయా పైపులైన్ నుంచి మరో 50 KLD నీరు సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 77 KLD పరిమాణం గల నీటిని సరఫరా చేస్తోంది. క్యాంపస్ కు జలమండలి ఒప్పందం ప్రకారం 505 KLD సరఫరా చేయాలి కానీ అదనంగా 689 KLD ల నీరు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం మరో 77 KLD కలిపి ఓవర్ ఆల్ గా 1271 KLD నీరు సరఫరా చేస్తోంది.
అంతర్గత పైపులైన్ ల నిర్వహణ మాత్రం యూనివర్సిటీ సిబ్బంది పరిధిలో ఉన్నందున కథనాల అంశం పై ఎండీ సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy)యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ తో ఫోన్లో మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలపై ఆరా తీసి దీనికంతటికీ కారణమైన వార్డెన్ (Warden)పై వైస్ ఛాన్సలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జలమండలి ఉన్నతాధికారులు సంబంధిత అసిస్టెంట్ ఇంజినీర్ తో కలిసి క్యాంపస్ ను సందర్శించారు.
ఆయన కూడా ప్రస్తుత పరిస్థితి పై జలమండలి అధికారులతో చర్చిం చారు. ఒప్పందం కంటే ఎక్కువే నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధా రించారు. అవసరం అయితే ఓయూ(OU) అధికారుల అభ్యర్థన మేరకు మరింత నీరు సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
OU Vice Chancellor is furious