Papanna Goud: ప్రజా దీవెన, నకిరేకల్: హైదరాబాద్లో ఈ నెల 11 వ తేదీన రవీంద్ర భారతి లో జై గౌడ్ ఉద్యమం జాతీయ కమి టీ ఆధ్వర్యలో తలపెట్టిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarva yi Papanna Goud) 374 వ జయంతి వారోత్సవాలను జయ ప్రదం చేయాలని నకిరేకల్ కల్లు (Nakirekal Kallu) గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్య క్షులు కొండ జానయ్య గౌడ్ పిలుపునిచ్చారు. జయంతి ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరుతూ సన్నాహాక సమావేశo గోడ పత్రిక ను శనివారం నకిరేకల్ గౌడ సంఘం భవనంలో ఆయన జై గౌడ్ ఉద్యమం జాతీయ అద్యక్షులు వట్టికూటీ రామారావు గౌడ్, తెలం గాణా రాష్ట్ర అధ్యక్షులు (TelaGana State Presidents) గుండ్రాతి నారాయణ గౌడ్, రంగారెడ్డి జిల్లా యువజన సంఘం అధ్యక్షులు కొండ రాజేష్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు లింగారపు మధుసుధన్ గౌడ్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం ప్రధాన కార్యదర్శి చనగాని రవి గౌడ్, కోశాధికారి కొండ యాదగిరి గౌడ్, కో ఆప్షన్ సభ్యులు చేవుగోని వెంకన్న గౌడ్, కొండ శ్రీను గౌడ్, మాదగోని వెంకన్న గౌడ్, సంఘం సభ్యులు చనగాని జనార్ధన్ గౌడ్, దండెంపల్లియాదగిరి గౌడ్ , చన గాని సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.