Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ కు తెలంగాణ అధికార బృందం

Paris Olympics:ప్రజా దీవెన, హైదరాబాద్: ప్యారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ 2024 (Paris Olympics)ను సందర్శించేందుకు తెలంగాణ అధికార బృందం సోమవారం బ యలుదేరింది.సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదే శాల మేరకు తెలంగాణ స్పో ర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి నేతృత్వమ్ లో ప్రభుత్వ సలహా దారులు( క్రీడలు) జితేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, వి సి &ఎండీ ఏ. సోనీ బాలాదేవి ఐఎఫ్ ఎస్,ఎన్ .ప్రకాష్ రెడ్డి ఐపీఎస్, కేంద్ర మాజీ మంత్రి ఎస్ వేణుగో పాలచారి (S Venugo Palachari), ఎం రవీంద ర్ రెడ్డిలు ఈ బృందంలో ఉన్నారు. క్రీడా స్టేడియాల (Sports stadiums) సందర్శ న, ఒలం పిక్స్ పోటీలకు చేసిన ఏర్పాట్లు, భవిష్యత్తులో ఒలంపిక్స్ నిర్వ హణకు ఉన్న అవకాశాల పరిశీలన, వివిధ దేశాలు క్రీడల్లో అభివృద్ధి సాధించడానికి అనుసరిస్తున్న విధానాలు, పతకాల పట్టికలో వివి ధ దేశాలు ముందంజలో ఉండడాని కి దోహదం చేస్తున్న కారణాలు పరి శీలించ దానికి తెలంగాణలో అత్యు త్తమ క్రీడా విధానాన్ని (Sports policy)తీసుకురా వడానికి ఈ క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది.ఈ పర్యటన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశిస్తు న్న క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఉపయోగపడేటట్లు, మన రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి దోహదం చేసే ఆలోచనలకు దారితీస్తుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డి, విసి అండ్ ఎండి శ్రీమతి ఏ సోనీ బాలాదేవి లు అభిప్రాయ పడ్డారు.