Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Patnam Mahender Reddy: నిరూపిస్తే నేనే కూల్చివేస్తా

–చిన్న చిన్న వాటిని క‌బ్జా చేస్తామా
–నాది ప‌ట్టా భూమి, వ్య‌వ‌సాయ కుటుంబం
–111 జివో ప్ర‌భుత్వ అనుమ‌తితో గెస్ట్ హౌజ్ నిర్మించాం
— గెస్ట్ హౌజ్ నిర్మాణంపై మాజీ మంత్రి ప‌ట్నం మహేందర్ రెడ్డి

Patnam Mahender Reddy: ప్రజా దీవెన, హైద‌రాబాద్: ప్రభు త్వ నిబంధనల ప్రకారమే హమా యత్ సాగర్‌లో ఓ ఇల్లు నిర్మించుకు న్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) తెలిపారు. తాను ఎలాంటి చెరువును ఆక్రమిం చలేదని తేల్చి చెప్పారు. కొంత మంది చెరువును కబ్జా చేసి ఇల్లు నిర్మించారని అంటున్నారని, అయి తే, కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హిమాయత్ సాగ ర్‌లో నిర్మించిన గెస్ట్ హౌస్‌పై బీఆర్ ఎస్ నాయకులు అక్రమంగా నిర్మిం చుకున్నారని చేస్తున్న ఆరోపణలపై ఆయన మంగళవారం మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు.తాత, తండ్రుల నుంచి తమది వ్యవసాయ కుటుం బమని, తమ కుటుంబానికి చాలా వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పారు.

అలాంటిది ఇంత చిన్న భూమిని కబ్జా చేయాల్సిన అవస రం తనకు లేదన్నారు. అక్కడ ఎలాంటి కాంపౌండ్ (Compound) లేదని కావాలంటే మీడియా ప్రతినిధులు సహా ఎవరై నా వెళ్లి చూడొచ్చని చెప్పారు. అవ సరమైతే పట్టా కాగితాలు కూడా ఇస్తా నని చెప్పుకొచ్చారు. వాస్తవాని కి అది చిన్న గెస్ట్ హౌస్ అని, అది ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో (As a guest house, it is FTL, the extent of the buffer zone)ఉందనే ఆరోపణల్లో నిజంలేదని మహేందర్ రెడ్డి చెప్పారు. అక్కడికి చుట్టుపక్కల పలు ఫంక్షన్ హాళ్లు, ఇతర నిర్మాణాలు కూడా ఉన్నా యని వివరించారు.ఒకవేళ నిబం ధనల ప్రకారం లేదని తేలితే.తానే ఆ భవనాన్ని హైడ్రా సహాయంతో కూల్చివేసేందుకు సహకరిస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు. ఎప్‌టీఎ ల్ పరిధిలో ఉందని నిరూపిస్తే త‌న‌ గెస్ట్ గౌస్ కూల్చివేసేందుకు సిద్ధ మని, అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడారని భావి స్తున్నట్లు చెప్పారు. 111 జీఓ పరిధి లో చాలా మంది మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు ఇళ్లు నిర్మించుకు న్నారన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే నిర్మించుకున్నామని చెప్పా రు.

హైడ్రా చ‌ర్య‌లు అభినందనీ యం.. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలను (Ponds and puddles)పునరుద్ధరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు బాగున్నాయంటూ పట్నం మహేం దర్ రెడ్డి ఈ సందర్భంగా మెచ్చుకు న్నారు. హైడ్రా ఏర్పాటును ఎమ్మెల్సీ ప్రశంసించారు. ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించా ల్సిన అవసరం ఉందని పట్నం మ హేందర్ రెడ్డి చెప్పారు. హైడ్రా తీసు కుంటున్న‌చ‌ర్య‌లు భేష్ గా ఉన్నా య‌ని, తాను వాటిని సంపూర్ణంగా స‌మ‌ర్ధిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.