Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Patnam Rajeshwari: మహిళల స్వేచ్చకై పోరాడిన పెరియార్

Patnam Rajeshwari: ప్రజా దీవెన, హైదరాబాద్: మహిళల స్వేచ్చకై , హక్కులకై (For freedom and rights)పోరాడిన ఉద్యమకారుడు పెరి యార్ ఇ.వి.రామస్వామి అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి (Patnam Rajeshwari) అన్నారు. మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యా లయంలో పెరియార్ రామ స్వామి145 వ జయంతి కార్యక్ర మాన్ని మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ పెరియార్ రామస్వామి కరుడుగ ట్టిన నాస్తికవాది అని హిందూ మ తాన్ని , బ్రాహ్మణ వర్గాన్ని పెరియార్ తీవ్రంగా ద్వేషించారని ఆమె తెలిపారు. పెరియార్ కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు కల్లు దుకా ణాలకు వ్యతిరేకంగా పెరియార్ భార్య నాగమ్మాయి , పెరియార్ సోదరి బాలాంబాల్ ముందుండి పోరాడారని , మహిళలను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ ప్రోత్సహించారని ఆమె అన్నారు.

పెరియార్ (Periyar)తమి ళనాడులో ఆత్మగౌరవ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయడమే కాకుండా ద్రవిడ ఉద్యమ నిర్మాత కూడా అని ఆమె అన్నారు.1930 సంవత్సరంలో హిందీ భాషను మద్రాసు పాఠశాలల్లో ప్రవేశ పెట్టినప్పుడు పెరియార్ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి చివరికి హిందీ బోధనను విరమింపజేసిన గొప్ప ఆత్మగౌరవ వాదీ అని ఆమె తెలిపారు. పెరియార్ రామస్వామి తమిళనాడులోని కోయంబత్తూరులో 17-9-1879 న జన్మించారని ఆమె తెలిపారు. పెరియార్ మనువాదానికి వ్యతిరేకంగా బ్రాహ్మణ వాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించి వేయాలని నిర్ణయించుకుని దాని కోసం నిర్బయంగా తన జీవిత కాలమంతా పోరాడారని ఆమె తెలిపారు. పెరియార్ గొప్ప సామాజిక విప్లవకారుడు (A social revolutionary)అని పెరియార్ ఆలోచనా విధానాన్ని ఆచరించే ప్రతిఒక్కరూ మనుధర్మానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని అప్పుడే పెరియార్ ఆశయ సాధనలో భాగస్వాములము కాగలమని ఆమె అన్నారు.