–కొత్త కోణాలపై దర్యాప్తు కొనసా గుతోంది
— విదేశాల్లో ఉన్నవారిని సైతం తీసుకొచ్చే ప్రయత్నాలు
–హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన హోం శాఖ
Phone tapping case: ప్రజా దీవెన, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయని, వాట న్నింటిపై దర్యాప్తు కొనసా గిస్తు న్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కు (State Government High Court) తెలిపింది. తప్పించుకొని తిరుగుతూ విదేశాల్లో ఉంటున్న నిందితులను పట్టు కుంటామని పేర్కొంది. నిందితులు తమ వ్యక్తిగత ఎజెండాలను అమ లు చేసుకోవడంతో పాటు, అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌కు సహాయం చేయడానికి ఈ అక్రమా లకు పాల్పడినట్లు తెలిపింది. వీట న్నంటి సమాచారంతో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేస్తామని పేర్కొం ది.
న్యాయమూర్తుల ఫోన్‌లను సైతం ట్యాపింగ్ చేశారంటూ పత్రిక ల్లో కథనాలు రావడడంతో ఈ అంశంపై హైకోర్టు సుమోటోగా విచారణ జరుపుతోంది. మంగ ళవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్‌కుమార్‌ల ధర్మాస నం మరోసారి విచారణ చేపట్టింది. ఇప్పటికే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కౌంటర్ దాఖలు చేయగా తాజాగా హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్త కౌంటర్ దాఖలు చేశారు. ‘‘ఫోన్‌ట్యాపింగ్ కేసు ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదిని దెబ్బతీసేలా జరిగిన తీవ్రనేరం. ఈ నేరంలో ప్రమేయం ఉన్న సీనియర్ పోలీస్ అధికారులను కూడా వదిలిపెట్టకుండా చట్ట ప్రకారం విచారణ కొనసాగిస్తున్నాం. ట్రయల్ కోర్టులో (Trial Court)ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశాం. ఏ–1 ప్రభాకర్ రావు సహా నిందితులందరూ తమ వ్యక్తిగత ఎజెండాలను అమలు చేయడంతోపాటు అప్పటి అధికారపార్టీ బీఆర్‌ఎస్ లక్ష్యాలను సాధించడానికి పనిచేశారు. ట్యాపింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు గుర్తింపుపొందిన అధికారిగా ఉన్న ప్రభాకర్‌రావు వామపక్ష తీవ్రవాదంపై నిఘా అన్న సాకుతో ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారం వ్యవహరించారు. తప్పుడు సమాచారంతో అనుమతులు పొందారు.
హార్డ్‌డిస్క్‌లను (hard disk)ధ్వంసం చేశారు. ఏ–1 ప్రభాకర్ రావు, ఏ–6 శ్రవణ్‌కుమార్ రావులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏ2 ప్రణీత్‌రావు అధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. బీఆర్‌ఎస్‌కు సహాయం చేయడం కోసం టి. ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులు తమ చట్టబద్ధమైన విధులను ఉల్లంఘించడంతోపాటు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ నిబంబధనలు ఉల్లంఘించడం, మోసాలకు పాల్పడటం ద్వారా అనుమతులు పొందడం వంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని ఆ కౌంటర్‌లో వివరిం చారు.
మాతో ఎలాంటి సంప్రదింపులు లేవన్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం కూడా కౌంటర్ సమర్పించింది. టెలిగ్రాఫ్ యాక్ట్ (Telegraph Act)ప్రకారం చట్టబద్ధంగా ఇంటర్‌సెప్షన్ ఆదేశాలు ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలు న్నాయని తెలిపింది. కేంద్ర ప్రభు త్వంతో రాష్ట్రంతో ఎలాంటి సంప్ర దింపులు జరపలేదని, కేసు దర్యా ప్తుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం ఇప్పటివరకు అందలేదని పేర్కొంది. తదుపరి విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా పడింది.