–వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవస ర రాద్దాంతం చేయొద్దని స్పష్టం
–జడ్జీలు,కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని హైకోర్టు ఆదేశo
–కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్ నెంబర్ ప్రచురించినట్లు ప్రస్తావించి న న్యాయస్థానం
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone tapping case) తెలంగా ణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసుపై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) విషయం లో మీడియా సంయమనం పాటించాలని సూచిం చింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని స్పష్టం చేసింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్ నెంబర్ ప్రచురించినట్లు కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.
ఈ విషయంలో మీడియా సంయమనం (Media restraint), బాధ్యతతో వ్యవహరిస్తుందని నమ్ముతున్నామని కోర్టు అభిప్రా యం వ్యక్తం చేసింది. ఫోన్‌టాపింగ్ కేసుకు సంబంధించిన వార్త రాసే టప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండా లని చెప్పింది. ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్ దాఖలు (Counter filing) చేశారని గుర్తుచేసింది. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదే శాలు ఇవ్వాలనుకోవడం లేదని ధర్మా సనం పేర్కొంది. ఈనెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలి సిందే. తదుపరి విచారణను 23కు హైకోర్టు వాయిదా వేసింది. కాగా పోలీసు శాఖతో (police department) పాటు రాజకీయప రంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యా ప్తును ప్రభుత్వం వేగవంతం చేసిం ది. ప్రణీత్ రావు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బహిర్గతమవుతోంది. ఎస్‌ఐబి కార్యాలయంతో పాటు ఇతర ప్రైవే టు ప్రదేశాల్లోనూ ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధాన ఆరోపణలు వినిపి స్తుండగా, పోలీసులు ఆ కోణంలో నూ దర్యాప్తు చేస్తున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, సీఐ గట్టు మల్లును పోలీ సులు విచారించిన విషయం తెలిసిందే.