–తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యాలు
–ప్రభుత్వాసుపత్రుల్లో రోజు రోజు కు పెరుగుతోన్న ఒపి కేసులు
–ప్రతి పల్లెలోనూ మంచానపడుతో న్న జ్వరపీడితులు
— కనీసం కంటికి కనపడని పారిశు ధ్య మెరుగు చర్యలు
Poisonous fevers: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ర్ట వ్యాప్తంగా అంతటా విష జ్వరాలు (Poisonous fevers) విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా (Dengue, Malaria, Typhoid, Chickenpox) వంటి విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. ప్రతి పల్లెలోనూ జ్వరపీడితులు వంద లాదిగా మంచాన పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్ప మిగిలిన చోట డెంగ్యూ నిర్థారణ పరీక్షలు లేక పోవడంతో ప్లేట్‌లేట్స్ ఆధారంగా వై ద్యసేవలు అందిస్తున్నారు. రాష్ట్రం లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్ప త్రులు జ్వరపీడితులతో కిటకి టలా డుతున్నాయి.
గతం కంటే ఓపీకి వచ్చిన వారి సంఖ్య పెరిగింది. జ్వర మొస్తే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని జ్వరపీడితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.క్షీణించిన పారిశుధ్యం కూ డా జ్వరాల విజృం భణకు ఒక కారణం. ఏ గ్రామంలోనూ పారి శుధ్యం మెరుగుకు చర్య లు చేపట్టే దాఖాలాలు లేవు. ఎక్క డికక్కడే మురుగు నిలిచిపోయి దోమలు విజృంభిస్తున్నాయి. ఈ దోమల బెడద వల్ల డెంగ్యూ, మలేరియా ప్రబలుతున్నాయి. ప్రతి 45 రోజు లకోసారి ఫాగింగ్ ద్వారా దోమల నివారణకు (Prevention of mosquitoes)చర్యలు చేపట్టాలి. కానీ ఆఊసే లేదు. మేజర్ పంచా యతీ ల్లో సైతం ఫాగింగ్ లేదు, పారిశుధ్య మెరుగుకు చర్యలు కానరావడం లేదు. తాగునీటి పథకాలు క్లోరినేష న్ చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోం ది. ఇక చిన్న పంచాయతీ గురించి వేరే చెప్పనవసరం లేదు. జ్వరాల అదుపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వాన కాలం సీజన్ కొనసాగుతోంది. పారిశుధ్యం మెరు గు, దోమల నివారణకు చర్యలు తీ సుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తు న్నా రు. అలాగే ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు.