— నోటీసుల కోసం సీబీఐని కోరాం
–నిందితులను ఎవరినీ వదిలపెట్టే ప్రసక్తే లేదు
–హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
Police Commissioner Srinivas Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశవ్యా ప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎవ రినీ వదిలిపెట్టబోమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి (Srinivas Reddy)స్పష్టం చేశారు. ప్రధాన నిందితులు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల అరె స్టుకు రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను కోరా మన్నారు. శనివారం ఆయన ఓ ప్రవేట్ మీడియాతో ఆయన మాట్లా డారు. సీబీఐ ప్రస్తుతం బ్లూకార్నర్ నోటీసు జారీ చేయాలనుకుంది. దాని వల్ల నిందితులు ఎక్కడున్నార నే వివరాలు తెలుస్తాయి. అయితే బ్లూ కార్నర్ నోటీసు ద్వారా నింది తులను అరెస్టు చేయడం కుదరదు. దాంతో రెడ్‌కార్నర్ నోటీసులు (Red corner notices) జారీ చేయాలని సీబీఐకి విజ్ఞప్తి చేశామ ని సీపీ వివరించారు. రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయితే నిందితులను అరెస్టు చేసి, భారత్‌కు తీసుకువస్తా మన్నారు. న్యాయపరమైన సమ స్యలను అధిగమిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
కాగా ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌కుమార్, (Bhujangarao, Tirupatna, former DSP Praneetkumar) టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు అరెస్టయిన విష యం తెలిసిందే. హృద్రోగ రుగ్మత లతో బాధపడుతున్న భుజంగరా వుకు చికిత్స నిమిత్తం ఇటీవలే కోర్టు మధ్యంతర బెయిల్ (bail)లభించిం ది. మిగతా ముగ్గురు చంచల్‌గూడ జైలులోనే ఉన్నారు. వీరి విచారణ సమయంలో పలువురు రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి రావడంతో వారికి నోటీసులు ఇచ్చి, విచారిం చేందుకు అధికారులు సిద్ధమవు తున్నారు.