Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponguleti Srinivas Reddy: నిర్దిష్ట నిబంధనల మేరకే భూముల క్రమబద్దీకరణ

–మూడు నెలల్లో ఎల్.ఆర్.ఎస్. ప్రక్రి య పూర్తి చేయాలి
–ప్రభుత్వ భూములను పరిరక్షించా
ఎల్.ఆర్.ఎస్.పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: లక్షలాది కుటుంబాలకు లబ్ధిచేకూర్చే లేఅవు ట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఎల్.ఆర్.ఎస్. ప్రక్రి యను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ము ఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల (private individuals)చేతుల్లోకి వెళ్ల కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎల్.ఆర్.ఎస్. పై శనివారం నాడు జిల్లా కలెక్టర్ లతో మంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఆ జిల్లా కలెక్టర్ ఆఫీసు (Collector’s Office) నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆగస్టు 31 నుండి అక్టోబర్ 31, 2020 వరకు ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల ను సీకరించింది ఆమోదించింది. ఈ సమయంలో 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. మొత్తం 25.70 లక్షల దరఖాస్తుల్లో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పరిధిలో 13.69 లక్షలు మరియు గ్రామ పం చాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటి పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుదారులు సమస్య పరి ష్కారం కొరకు నాలుగు సంవత్సర ముల నుండి ఎదురుచూస్తున్నారు.

ఈ దరఖాస్తులను అత్యంత ప్రాదా న్యతాక్రమములో పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. ఇందు కోసం, జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై తీసుకోవాలని, ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూ శాఖ (Department of Revenue)నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల తో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందా లను ఏర్పాటుచేయాలి. క్రమబద్ధీ కరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమ స్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్ లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు (హెల్ప్ డెస్క్లు) వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (Greater Hyderabad Municipal)కార్పొరేషన్, హైదరాబా ద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలి పారు. ఎల్అర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాము లయ్యే అన్ని స్థాయుల సిబ్బంది, అధికారులకు శిక్షణ తక్షణమే చేపట్టాలని, ఎల్ఆర్ఎస్ విధి విధానాలను విడుదల చేసిన నేపథ్యంలో అమలుకు అవసర మైన కార్యాచరణను చేపట్టాలని, జిల్లా కలెక్టర్ లు ఈ ప్రక్రియ ను నిరంతరం పర్యవేక్షించాలని సూచిం చారు.

హెచ్‌ఎండీఏ (HMDA)పరిధిలో ఉన్న ఏడు జిల్లాలల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని ఈ జిల్లాల్లో లేఅఔట్ ల క్రమబద్దీకరణ విషయ ములో తగిన జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని పట్టణ మరి యు గ్రామీణ ప్రాంతాలలో ప్రణాళి కాబద్ధమైన స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. వారి ఆస్తులకు చట్టపరమైన గుర్తింపుతో సహా ఆమోదించబడిన లేఅవుట్ల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహిస్తుం దన్నారు. ఆమోదించబడిన లేఅ వుట్ యజమానులకు ఇంటి నిర్మాణాలకు భవన నిర్మాణ అను మతులు పొందేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, కొనుగోలు చేయడానికి మరియు విక్రయిం చడానికి సహాయపడుతుం దన్నా రు.