Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponguleti Srinivas Reddy: భూ సమస్యల శాశ్వత పరిష్కార మే లక్ష్యం

–ముగిసిన ప్రభుత్వ ప్రజాభిప్రాయ సేకరణ
–కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన కు కసరత్తు
–రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ లో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై ప్రజలనుండి అభి ప్రాయ సేకరణ పూర్తయిన నేపథ్యం లో చట్ట రూపకల్పనపై దృష్టి సారిం చాలని, కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి అవసరమైన కసరత్తును త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, (Revenue, Housing) సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అధికారులను ఆదేశించారు.

వచ్చిన అభిప్రాయాలు, సూచన లు, సలహాలు అన్నింటినీ ఒక దగ్గర పొందుపరచి పరిశీలించా లని, వచ్చిన వాటిలో ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఏది అవసరమో ఆ అంశాలను ఈ కొత్త చట్టంలో ఉండేలా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. మా రుతున్న కాలానికి, పరిస్థితులకు తగినట్టుగా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజ ల దశాబ్దాల ఆకాంక్షలకు అనుగు ణంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసు కురాబోతున్నామని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూ సమస్యలు (Land issues) పరిష్కారం అవుతాయ ని భావిస్తే, గత పాలకుల తొందర పాటు నిర్ణయాలతో అది నెరవేర కపోగా కొత్త సమస్యలు ఉత్పన్నం అయ్యాయని విమర్శించారు. 20 20 రెవెన్యూ చట్టం లోపభూయి ష్టంగా ఉండడంతో రైతులు, భూ యజమానులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ధరణి పోర్టల్ వల్ల భూ సమస్యలు మరింత పెరిగాయని, దీంతో రైతులు, భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివచ్చింది. తప్పుల తడకల ధరణి వల్ల రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది రైతులు ధరణి బాధితులుగా మారారు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా మేధావులు, నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, ప్రజా ప్రతినిథులు, రైతులు, సామాన్య ప్రజలనుంచి కూడా అభిప్రాయాలను స్వీకరిం చడం జరిగింది.

ముసాయిదాపై ఈ నెల రెండవ తేదీన శాసన సభలో చర్చించి అదే రోజు హైదరాబాద్ లోని భూ పరిపాలన (Land administration) ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో వర్క్ షాప్ లు కూడా నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయిలో నిర్వహించిన వర్క్ షాప్ లలో వచ్చిన సూచనలను ఒక నివేదిక రూపంలో కలెక్టర్లు వెంటనే భూపరిపాలన కార్యా లయానికి పంపించాలని ఆదే శించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృ త స్థాయిలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున సూచనలు వచ్చాయి. లిఖిత పూర్వకంగా, అలాగే ఈమెయిల్ ద్వారా కూడా సూచనలు వచ్చాయి. సామాన్యు లు సైతం పలు సూచనలు చేశా రు. అమలు చేసేవారికి అవగాహన ఉండేలా రైతులకు, సామాన్య ప్రజ లకు అర్థమయ్యే రీతిలో అవినీతి రహితంగా చట్టాన్ని తీసుకురాబో తున్నాం. గత ప్రభుత్వంలో అత్యం త రహస్యంగా ఉన్న ధరణిని మా ప్రభుత్వం ఒక పబ్లిక్ డాక్యుమెంట్ (A public document)గా అందరికీ అందుబాటులో ఉంచబోతుంది అని ప్రకటించారు.