–శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivasa Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అసంపూర్తిగా మిగిలిన ఇళ్లతో పాటు బీఆరెస్ 3లక్షల రూపాయల మంజూరీ చేసిన 496 ఇళ్లను కూడా 5లక్షల చొప్పున కేటాయించి పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహని ర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy)వెల్లడించారు. మండలిలో ఎమ్మెల్సీ తాతా మధు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ గత ప్రభుత్వం నుంచి అధికారులు సేకరించని డేటా మేరకు 496 ఇళ్లకు మాత్రమే అనుమతిని చ్చిందన్నారు.
ఇక ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో (Power of Congress) ఉన్నప్పుడు 2006 నుంచి 2014 వరకు తెలంగాణాలో దాదాపు 19 లక్షల ఫ్లై చిలుకు ఇంది రమ్మ ఇళ్లను పూర్తి చేసిందని, కానీ గత బీఆరెస్ ప్రభు త్వం పదేళ్లలో కేవలం 1,36,116 ఇళ్లు పూర్తి చేసినట్లు అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపారు. అలాగే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లో పైలట్ ప్రాజెక్ట్ కింద సగం పూర్తి అయ్యి మొండి గోడలతో ఉన్న ఇళ్లను మా ప్రభుత్వం పూర్తి చేస్తుం దని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ల (Double bed rooms)పేరుతో పేదలకు ఇళ్ల నిర్మా ణం అందకుండా బీఆరెస్ చేసింద న్నారు. మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంతో పేదల సొంతింటి కల నేరవేర్చనున్నామని, ముందుగా అతి పేద వారికి ఇళ్లను (houses) మంజూరు చేస్తామన్నారు.