ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభుత్వం పక్షాన అన్నివేళలలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లాల పని చేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభు త్వానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహా, సమాచార శాఖమాత్యులు (Revenue, Home and Information Departments) పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) పిలుపునచ్చారు. శామీర్ పేటలోని నల్సార్ యూనివర్సిటలో (Nalsar University)ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి లో 33 జిల్లాల తహాసీల్దార్లతో ముఖాము ఖి కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహా, సమాచార శాఖమాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసినారు. ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ (Principal of Land Revenue)సెక్రటరీ నవిన్ మిట్టల్, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం లు మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లాల పని చేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభు త్వానికి మంచి పేరు తేవాలని తహా సీల్దార్లకు సూచించారు.
ప్రభుత్వ శాఖలలో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ (Department of Revenue) ప్రత్యేకమైనద ని, అంతే కాకుండా అన్ని సందర్భా లలో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారని మంత్రి అన్నారు. రాష్ట్రం మొత్తంలో సుమారు 972 మంది తహాసీల్దార్లు ఉన్నారని, గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో ఉండే సమస్యలను ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ముఖాముఖ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి అన్నారు. అంతే కాకుండా రెవెన్యూ చట్టాల సవరణలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలకు మీరు ఇచ్చేసలహాలు, సూచనలను కూడా అవసరమైన మేరకు పరిగణలోనకి తీసుకుంటామని మంత్రి వివరించారు. ఏవిధంగా, ఏమి చేస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందో, ఏలా చేస్తే మంచి పరిష్కారం దొరుకుతుందో అన్ని విధాల ఆలోచించి రెవెన్యూ చట్టాలను (Revenue Acts) సవరిస్తామన అన్నారు.ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే నిరంతరం ఆలోచిస్తుందని, ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉండేలా మీరు ప్రజలకు సేవలందరిచాలని మంత్రి తెలిపారు. ధరణిలోని సమస్కలతో ప్రజలు,రైతులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని, అందుకే ముఖ్యమంత్రి ఆర్ ఓ ఆర్ చట్టాల రూపకల్పనను చేసారని మంత్రి అన్నారు. ఇక్కడ ఉన్నవారందరు ఎక్కువ శాతంరైతు కుటుంబాల నుండి వచ్చిన వారై ఉంటూరు, కనుకరైతుల సమస్యలు మీకందరికి తెలుసని, ఎవరైన రైతులు, పేదవారు ఏవైనా సమస్యలతో మీ దగ్గరికి వస్తే వారిని విసుక్కొకుండా, కనీస మర్యాదతో సౌమ్యంగా మాట్లాడాలని మంత్రి తహాసీల్దార్లకు సూచించారు.
రెవెన్యూ శాఖలలో Department of Revenue) ఎంత నిజాయితీగా పనిచేసిన కూడా నిందలు తప్పవు, కనుక మన అంతరాత్మను సాక్షిగా పెట్టుకొని పనులు చేయాలన్నారు. కార్యాలయాలలో సిబ్బంది కొరత, మౌళిక వసతులు, ఫర్నీచరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయిన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ కూడా ప్రభుత్వ పథకాలను ప్రజల వరకు చేరవేయడంలో, ప్రభుత్వ భూములను రక్ష్తించడంలో మీరు ముఖ్య భూమిక వహిస్తున్నారన్నారు. అందుకనుగుణంగా మీసమస్యలను తీర్చేలా చర్యలు తీసుకుంటానని మంత్రి తెలిపారు. మీరు తప్పు చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందో లేదో గాని ప్రభుత్వానికి మాత్రం చెడ్డపేరు వస్తుందని మంత్రి అన్నారు. అందువల్ల మీ స్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉంటూ పాజటివ్ గా ఆలోచిస్తూ ప్రజలకు మంచి చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి తహాసీల్దార్లను కోరారు. ముందుగారాష్ట్రస్థాయిలోతహాసీల్దార్లు తెలిపిన వారి శాఖపరమైన, వ్యక్తిగత సమస్యలను, సలహాలను సానుకూలంగా మంత్రి ఆలకించారు. వాటికి ప్రతిస్పందిస్తూ రెవెన్యూ శాఖకు Department of Revenue)పెద్దన్న లా నేను ఉంటూ న్యాయమైన మీ అందరి సమస్యలను తీరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవిన్ మిట్టల్, ఐఎఎస్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలోనే ఈరోజు చారిత్రాత్మకమైనరోజని , నా సర్వీసు 28 సంవత్సరాలలోనే రెవెన్యూ మంత్రి తహాసీల్దార్లతో ముఖాముఖీ మాట్లాడడం మొదటిసారి అని అన్నారు. గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు ఏశాఖలు చేయలేని పనులను సైతం రెవెన్యూ శాఖ నిర్వహిస్తుందని ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నారు. మీ సమస్యలను వినడానికి, వాటికి తగురీతిలో పరిష్కరించడానికే మంత్రి విచ్చేసారని, జిల్లాల వారిగా సమస్యలను మంత్రికి వివరించాలని తహాసీల్దార్లనుకోరారు.ఈ కార్యక్రమానికి సహాకరించిన నల్సార్ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ కు శాలువు మెవెంటోతో మంత్రి సన్మానించారు. అనంతరం 33 జిల్లాల తహాసీల్లార్లు జిల్లాల వారిగా మంత్రితో కలిసి గ్రూప్ ఫోటోలు తీయించుకున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.