Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponnam Prabhakar: గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు

–హైదరాబాద్‌లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తాం
— గల్ఫ్‌ ప్రభావిత నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం సమీ క్ష

Ponnam Prabhakar: ప్రజా దీవెన, హైదరాబాద్‌: గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం (Welfare of Gulf workers) కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబం ధించిన ఉత్తర్వులు జారీ కాను న్నాయి. గల్ఫ్‌ ప్రభావిత నియోజక వర్గాల ప్రజాప్రతినిధులు ఈ బోర్డు లో భాగస్వాములుగా ఉండ నున్నారు. బోర్డు ఏర్పాటు, దాని విధివిధానాలపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలి సింది. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై (Welfare of Gulf workers) చర్చించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. గల్ఫ్‌ కార్మికులు అధికంగా ఉండే నియోజక వర్గాల ప్రజాప్రతినిధులు, పీసీసీ ఎన్నారై సెల్‌ నాయకులు ఇందులో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. హైదరాబా ద్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ప్రజావాణిలో గల్ఫ్‌ బాధి తులు, వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఈ నెల 20 నుంచి ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను ఏర్పా టు చేస్తామని తెలిపారు. కార్మి కులు, వారి కుటుంబ సంక్షేమం కోసం జిల్లాకొక ప్రవాసీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సెట్విన్‌, న్యాక్‌ లాంటి సంస్థలతో వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు.

గల్ఫ్‌ కార్మి కుల (Gulf workers) పిల్లలకు గురుకుల పాఠశా లలు, కళాశాలల్లో సీట్లు కేటాయి స్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏర్పడిన నాటి నుంచి (డిసెంబరు 7, 2024) తర్వాత గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పు న ఎక్స్‌గ్రేషియా అంద జేస్తామ న్నారు. అంతకుముందు మర ణించిన వాళ్ల కుటుంబాలకూ మానవతా దృక్పధంతో రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామన్నారు. రైతు బీమా తరహాలో గల్ఫ్‌ కార్మికుల కోసం గల్ఫ్‌ బీమా (Gulf Insurance) ఉండాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు. గల్ఫ్‌లో ఎవరైనా చనిపోతే భౌతిక కాయాన్ని తీసుకురావడానికి వారాల తరబడి సమయం పడు తుందనీ, 48 గంటల్లోగా వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు.