–రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు
–ప్రజల భాగస్వామ్యంతో వివరాల సేకరణ
–హైడ్రా చర్యలకు పెద్ద ఎత్తున ప్రజా మోదం ఉంది
–రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: ప్రజా దీవెన, హైదరాబాద్: హైడ్రా (hydra) చర్యలకు ప్రజామోదం ఉందని, ఈ తరహా చర్యలు రాష్ట్రమంతటా విస్త రిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర భాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. తెలంగాణ అం తటా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. సోమ వారం ఆయన మీడియాతో మాట్లా డారు. వాటి వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆక్రమణలకు గురైన చెరువుల వివరాలను తమకు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ (hyderabad) పరిధిలో హైడ్రా చేపట్టిన చర్యలను ప్రజలంతా ఆమోదిస్తున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్ష ణ తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పరిరక్షించుకోవాలని ధ్యేయంతో ప్రభుత్వం ఉందని మంత్రి పొన్నం అన్నారు. గతంలో ఎక్కడ చెరు వులు ఉన్నాయో స్వచ్ఛంద సంస్థ లకు, స్థానికులకు తెలుస్తాయని, ఎవరైనా పోలీసు, రెవెన్యూ అధికా రుల దృష్టికి తీసుకురావాలని కో రారు. చెరువుల పరిరక్షణ (Conservation of ponds) స్థాని కులదేనని అన్నారు. ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు లేదని తేల్చి చెప్పారు.వివరాలు ఇవ్వడంతో ప్రజలు సహకరించాలి.ఎవరికైనా అన్యాయం జరిగిందంటే కోర్టులు ఉన్నాయని, వాటిని ఆశ్ర యించ వచ్చునని మంత్రి పొన్నం అన్నారు. చెరువుల, ఎక్కడికక్కడ అక్రమణకు (In ponds, irregularity everywhere) గురయ్యాయో వాటి ఆధారాలు సంబంధిత అధికా రుల కు ఇవ్వాలని సూచించారు . ప్రజ లంతా ఈ కార్యక్రమం లో భాగస్వా మ్యం కావాలని ఆయన కోరారు.