— సంక్షేమ పాఠశాల లో ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి
–హాస్టల్ లు ,తరగతి గదులు శుభ్రం గా ఉండేలా ప్రిన్సిపల్ జాగ్రత్త చర్యలు చేపట్టాలి
Ponnam Prabhakar: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అన్ని బీసీ , ఎస్సి, ఎస్టీ , మైనారిటీ (BC, SC, ST, Minority)గురుకుల పాఠశాలలో (Gurukula schools) చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని రవాణా మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గురుకుల పాఠశాలలో వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలి.
తాగునీటి విషయంలో (The matter of drinking water)జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి అస్వస్థత గా ఉన్న ఏఎన్ఎం పర్యవేక్షణలో చికిత్స అందించాలి.పిల్లల హైట్, వెయిట్ రికార్డు చేయాలి. విద్యార్థులకు నాణ్యమైన మంచి పోషకాహారం అందించాలి. ఆహారం వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.పరిసరాల శుభ్రత, తరగతి గది హాస్టల్ గది శుభ్రతపై (Cleanliness of surroundings, class room, hostel room cleanliness) పిల్లలకి అవగాహన కల్పించాలి. పిల్లలకు హిమోగ్లోబిన్, విటమిన్-డి లాంటి పరీక్షలు నిర్వహించాలి. పాఠశాలలో ఆవరణలో శుభ్రంగా ఉంచాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లను ఆదేశించారు. ఇటీవల జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని , జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలను (Gurukula schools) పర్యవేక్షించాలని సూచించారు.