Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Poonam Prabhakar: గీతా కార్మికులకు ‘సేఫ్టీ ‘మోకులు రక్షణ కవచం

–ఏ ఒక్క గౌడ బిడ్డ చెట్టు నుంచి ప‌డిపోయార‌నే మాట రావొద్దు
–ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ది వేల కిట్ల పంపిణీ
–బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ గౌడ్

Poonam Prabhakar: ప్రజా దీవెన, కరీంనగర్ : గీత కార్మికుల‌కు సేఫ్టీ మోకుల‌తో ర‌క్ష‌ణ‌ గా ఉంటుంద‌ని, గీత కార్మి కుల శ్రేయోస్సు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(revanth Reddy)ధ్యేయ‌మ‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్(Poonam Prabhakar)అన్నారు. గురువారం కరీంనగర్ పట్టణంలోని రామగుం డం బైపాస్ రోడ్డులో కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకుల పంపి ణీ కార్యక్రమంలో ఆయ‌న‌ పాల్గొ న్నారు.రెండు ల‌క్ష‌ల మందికి కిట్లు.

ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Poonam Prabhakar)మాట్లాడుతూ 1500 కిలోల బరువులను కూడా తట్టుకునే విధంగా ఈ సేఫ్టీ కిట్ల‌ను తయారు చేసిన‌ట్లు తెలిపారు. గీత కార్మికులు( Geeta workers )తాటి చెట్టు ఎక్కిన వారి ప్రాణాలు రక్షించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మొదటి దశలో హైదరా బాద్ మినహా 100 నియోజకవ ర్గాల్లో 10 వేల కిట్లు (kits)పంపిణీ చేస్తామ‌న్నారు. రిజిస్టర్ అయిన రెండు లక్షల మంది గీత కార్మికు లకు కిట్లు పంపిణీ చేస్తున్నా మ‌న్నారు.భవిష్యత్ లో తాటి చెట్టు నుండి పడి చనిపోయారని మాట వినపడకూడదన్న ఉద్దేశంతో ఈ కిట్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌ని మంత్రి అన్నారు. శిక్ష‌ణ (training)పొందిన వారందరికీ కిట్లు ఇవ్వాల‌ని సూచించారు. సోషల్ మీడియాలో కాటమయ్య రక్షణ కవచం మీద అవగాహన కల్పించాలని పిలుపు నిచ్చారు.టూరిజం(tourism )స్పాట్ గా మా నేరు మానేరు రిజ‌ర్వాయ‌ర్‌ టూరి జం స్పాట్ గా అభివృద్ధి జరగాలని పొన్నం అన్నారు. ఎల్లమ్మ తల్లి బిడ్డ గా ఈభూమి కాపాడే బాధ్యత త‌నే దేన‌ని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు ఈ జిల్లాలో మూడు వ‌చ్చాయ‌ ని తెలిపారు. హుస్నాబాద్ , మాన కోడూరు , మంథని ల‌కు కాంప్లెక్స్‌ లు వ‌చ్చాయ‌ని, ఇందుకు రూ. 180 కోట్లతో భవనాలు నిర్మాణం, మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు, శుక్ర‌వారం శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు చెప్పారు.