Prajavani: రేపటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం
ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్ర మం శుక్రవారం నుంచి పునః ప్రారం భం కానున్నట్లు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు.
లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల తాత్కాలిక వాయి దా, తిరిగి ప్రారంభం
ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణా ళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి వెల్లడి
ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రజావాణి అర్జీల స్వీకరణ(Receipt of Public Broadcasting Applications)కార్యక్ర మం శుక్రవారం నుంచి పునః ప్రారం భం కానున్నట్లు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి(Dr. G. Chinnareddy)తెలిపారు.దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందు వల్ల ప్రజావాణి అర్జీల కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడిందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.లోక్ సభ ఎన్నికల కోడ్(Lok Sabha Election Code)ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్య క్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే(Mahatma Jyotiba Phule)ప్రజా భవన్ లో ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి వివరించారు.ఈ అవ కాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని చిన్నారెడ్డి కోరారు.ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సి పల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తు న్నారు.
Prajavani re started from tomorrow