Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prakash Raj: వైసీపీ కి ప్రాణంగా ప్రకాశ్ రాజ్

Prakash Raj: ప్రజా దీవెన, హైదరాబాద్: లడ్డూ వివాదంలో నిండా మునిగి పోయిన వైసీపీ కూటమి నేతలకు ముఖ్యంగా కల్ట్ హిందూత్వాన్ని చూపిస్తున్న పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan)కౌంటర్ ఇచ్చే సరుకు ఉన్న లీడర్లు ఎవరూ తమకు కనిపించడం లేదు. దీంతో తమ వాదన ఎక్కడా వినిపించడం లేదని అనుకుం టున్న వారికి ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఆశాకి రణంలా కనిపిస్తున్నారు. ఆయన ను వీలైనంత త్వరగా రంగంలోకి దింపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షణ బో ర్డు ఉండాలని వ్యక్తం చేసిన అభి ప్రాయంపై ప్రకాష్ రాజ్ స్పందిం చారు. లడ్డూ కల్తీని జాతీయ సమస్యగా చేయవద్దని నింది తుల్ని శిక్షించాలన్నాడు.

ఈ వ్యా ఖ్యలపై పవన్ (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేసి ఘాటుగా స్పందించారు. నేపాల్ షూటింగ్ లో ఉన్న ప్రకాష్ రాజ్‌.. తాను చెప్పింది మీరు అర్థం చేసు కోలేదని నెలాఖరులో వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతానని వీడియో రిలీజ్ చేశారు. వెంటనే అంబటి రాంబాబు తెరపైకి వచ్చా రు. అసలు ప్రకాష్ రాజ్ ఏం తప్పు మాట్లాడారని పవన్ రెచ్చిపో యారని ఆయనను వెనకేసు కొచ్చారు. ప్రకాష్ రాజ్ వాయిస్ అయితే పవన్ కల్యాణ్ విష యం లో గట్టిగా వినిపిస్తుందని వైసీపీ ఆశ పడుతుందని అంబటి రాంబా బు ఉత్సాహంతోనే తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ను వైసీపీ (ycp) నేతలు సంప్రదించారని ఆయనకు సన్నిహితులైన ద్వారా పవన్ తో రచ్చ చేయించేందుకు సిద్ధమ య్యారని అంటున్నారు. అయితే ప్రకాష్ రాజ్ వచ్చేటప్పటికి పరిస్థితి చేయి దాటిపోతుందని.. అప్పుడు వచ్చినా ప్రయోజనం ఉండనది వైసీపీ వ్యూహకర్తలు కంగారులో ఉన్నారు. ప్రకాష్ రాజ్‌కు ..మెగా కాంపౌండ్‌తో (Mega compound) మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన మా అధ్యక్షుడి గా నిలబడినప్పుడు చాలా ఇబ్బం దులు ఎదుర్కొని కూడా సపోర్టు చేశారు. ఇప్పుడు తనకు మాలిన రాజకీయంలో పవన్ ను ఎందుకు గెలుక్కుంటున్నారన్నది కూడా ఆసక్తికరమే.