Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Priyanka Gandhi: రాజకీయ దుమారం, బిజెపి, కాంగ్రెస్ మధ్య చెలరేగిన వైనం

Priyanka Gandhi: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉన్నఫలంగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసు కుంది. బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదురి ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిర సిస్తూ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో బీజేపీ కార్య కర్తలు కాంగ్రెస్ నాయకులను అడ్డు కునే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ నాయ కులు కాంగ్రెస్ శ్రేణులపై తిర గబడ టంతో కర్రలతో రెండు పార్టీల నాయకులు కొట్టుకున్నారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుప త్రికి తరలించారు.ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిదురి ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీ జేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గలలా తయారుచేస్తామన్నారు. ఈ వ్యా ఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిప డ్డారు. మరోవైపు ఆప్ నేత అతిషి పై కూడా రమేష్ బిదురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాం ధీపై చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పారు. తాను అలా అని ఉండాల్సింది కాదన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటు న్నట్లు తెలిపారు.

దేశ రాజధాని రాజకీయాల నేప థ్యంలో… ఢిల్లీలో మరికొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగ నున్నాయి. వరుసగా నాలుగోసారి గెలిచేందుదకు ఆప్ ప్రయత్ని స్తుండగా కమలం జెండా ఎగరవే యాలని బీజేపీ ఎత్తులకు పై ఎత్తు లు వేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం అధికారం తమదే అంటోంది. తాజాగా బీజేపీ ప్రకటించిన ఢిల్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రమేష్ బిదురిని కాల్కాజీ నియో జకవర్గం నుంచి సీఎం అతిషిపై పోటీకి దింపింది. రమేష్ బిదురిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన వివాదస్పద వ్యా ఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటు న్నారు. ప్రియాంకగాంధీపై తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తు న్నవాళ్లు గతంలో లాలు ప్రసాద్ యాదవ్ హేమమాలినిపై చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలే దని ప్రశ్నించారు.

ఏది ఏమైనా ఎన్నికల వేళ రమేష్ బిదురి వ్యా ఖ్యలు వివాదస్పదం కావడంతో ఆయన ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు.తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత గాంధీ భవన్ నుంచి నాంపల్లి బీజేపీ కార్యాల యానికి భారీగా చేరుకున్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈలోపు బీజేపీ శ్రేణులు ప్రతిఘటించడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందిస్తూ బీజేపీ శ్రేణు లపై దాడిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. తక్షణమే నిందితు లపై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు.