ప్రజా దీవెన, హైదరాబాద్: శాసనమండలి సభ్యులు, TJS అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం 20 డిసెంబర్ 2024, బుధవారం బి ఆర్ కె భవన్‌లో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ బహిరంగ విచార ణకు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో ఉన్న లోపాలను, నిబంధనల ఉల్లంఘ నలను కమిషన్ ముందు ఉంచా రు. విచారణ అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మీడియా తో మాట్లా డారు. కమిషన్‌కు ఇప్పటికే ఒక అఫిడవిట్ సమర్పించిన కోదండ రాం దానికి అనుబంధంగా మరొక లేఖను కూడా సమర్పించారని తెలిపారు.
“ప్రాజెక్టు నిర్మాణం ఇంజనీర్ల సూచనలకు వ్యతిరేకంగా చేపట్టబడింది. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించడం సరైన పరిష్కారమని నిపుణులు చెబు తున్నారు,” అని ఆయన వ్యా ఖ్యానించారు.కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అప్పులు తప్ప నీళ్లు రాలేదని విమర్శించిన ఆయన, ప్రాజెక్టు డిజై న్‌లో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. “కాళేశ్వరం కమీషన్ కు ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశాను. దానికి అనుబంధంగా మరొక లేఖను పంపించానని పేర్కొన్నారు.ప్రాజెక్టు డిజైన్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, “తెలంగాణ మలిదశ ఉద్యమానికి ముందే గోదావరి జలాలపై చారిత్రక అధ్యయనం చేశాం.
ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో నీటిని అందించడానికి రూపొందిం చబడింది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అభ్యంతరాలను వ్యతిరేకించి అమలు చేశారని అన్నారు.కాగ్ నివేదికలో ప్రాజెక్టు నిబంధనలు ఉల్లంఘించబడినట్లు స్పష్టం చేసిందని ప్రస్తావిస్తూ, “బీఆర్ ఎస్ నాయకులు మేమే కట్టి నాం అంటున్నారు. కానీ, కట్టినవి పని చేయాలి కదా అని ప్రశ్నిం చారు. మేడిగడ్డ పనికిరాదని CWC ఇప్పటికే తేల్చిచెప్పిందని, తుమ్మి డిహట్టి వద్ద నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఫార్ములా వన్ రేస్ అంశంపై స్పందన….కేటీఆర్ ఫార్ములా వన్ రేస్ కోసం ప్రజాధనాన్ని దుర్విని యోగం చేయడం తప్పిదమని విమర్శించిన కోదండరాం “క్యాబినెట్ అనుమతి లేకుండా అలాంటి నిర్ణయం తీసుకోవడం తగదు. కేటీఆర్‌పై చర్యలు తప్పక అవసరమని అభిప్రాయపడ్డారు.
కొత్త కారు కొనుగోలుపై వివరణ….కొత్త కారు కొనుగోలు పై వచ్చిన విమర్శలపై స్పందించిన కోదండరాం గారు, “నా కారు చాలా తిరిగింది. కొత్తది కొనడం తప్పని సరి. ఎమ్మెల్సీ అయ్యాక ఇచ్చే లోన్ ద్వారా కొత్త కారు కొనుగోలు చేశాన నని వివరించారు. ఈ కార్యక్రమం లో TJS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, సర్దార్ వినోద్ కుమార్, రవికాంత్, నాగరాజు, అనిల్ తది తరులు పాల్గొన్నారు.