Railway Passengers: ప్రజా దీవెన, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు (Railway Passengers) సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్లలో (Warangal Railway Stations) పలు ట్రైన్ల స్టాపేజీని తాత్కాలి కంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. హసన్‌పర్తి రోడ్- వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న నాలు గో లైను ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ట్రైన్ల స్టాపేజీని రద్దు చేసినట్లు చెప్పారు. స్టేషన్‌లో ప్రతి రోజు ఆగే కొన్ని ట్రైన్లు ఈ నెల 25 నుంచి 28 వరకు ఆగవని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడిం చారు.
శాలీమార్ ( ట్రైన్ నెంబర్ 12773), విశాఖ- సికింద్రాబాద్ గరీబ్ రథ్ ( ట్రైన్ నెంబర్ 1273 9/40), లింగంపల్లి-కాకినాడ టౌన్ గౌతమి ( ట్రైన్ నెంబర్ 12776/ 75), సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ( ట్రైన్ నెంబర్ 20707 /08, 20834/33), టాటా- యశ్వం తాపూర్( ట్రైన్ నెంబర్ 18111) ట్రైన్లుల కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆగుతాయని చెప్పారు.ఇక ఎప్ప టిలాగే వరంగల్ మీదుగా సికింద్రా బాద్ మార్గంలో నడిచే మిగతా ట్రైన్లన్నీ కూడా వరంగల్‌లో ఆగకుండా కాజీపేట రైల్వే స్టేషన్‌లో మాత్రమే ఆగుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే ఓ ప్రకనటలో పేర్కొంది. యశ్వంతాపూర్- నిజాముద్దీన్( ట్రైన్ నెంబర్ 12649/50) ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను కాచీగూడ, నిజామాబాద్, ముద్కెడ్, పంపాల్ కుటీ, నాగపూర్ మీదుగా దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ ట్రైన్‌కు బల్లార్షా స్టాపేజీని (Ballarshaw stoppage) ఎత్తివేశారు. ట్రైన్ల రద్దుకు సంబంధించిన వివరాల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే ఎక్స్ ట్విట్టర్ అకౌంట్‌ను చూడాలని చెప్పారు.
కాజీపేట సమీపంలోని ఉనికిచెర్ల రైల్వే గేటు (Railway gate) వద్ద సొరంగ మార్గం నిర్మించిన సంగతి తెలిసిందే. ట్రైన్ల ఆలస్యం తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఈ మేరకు రైల్వే చీఫ్ సెప్టీ అధికారిణి (Railway Chief Sept)మాధవి.. సొరంగ మార్గాన్ని పరిశీలించి ఆలోచన బాగుందని.. ఇలాంటి మార్గాలను అవసరం ఉన్న చోట నిర్మించాలని సూచించారు. హసన్‌పర్తి రోడ్- వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య నిర్మించిన నాలుగు లైన్ల ట్రైన్ (A four line train) పట్టాలను సీఆర్‌ఎస్ బృందంతో కలిసి ఆమె పరిశీలించారు. ఉనికిచర్ల సొరంగ మార్గంపై ఢిల్లీ నిపుణుల బృందంతో చర్చించి ఫిట్‌నెస్ ధ్రువీకరణ ఇస్తామని అన్నారు. త్వరలోనే ఈ సొరంగ మార్గం అందుబాటులోకి వస్తుందని.. ఆ తర్వాత ట్రైన్ల ఆలస్యానికి చెక్ పడుతుందని చెప్పారు.