Rain Alert: ప్రజా దీవెన, హైదరాబాద్: ఇటీవల ఓ నాలుగు రోజులు నాన్‌స్టాప్‌గా (non stop) కురిసిన వర్షాలకు హైదరాబాద్ అ తలాకుతలం అయ్యింది. ఆ వర్షం పోయి పది రోజుల పాటు ఎండలు వచ్చాయి. దీంతో జనాలంతా హ మ్మయ్య అనుకున్నారు. కానీ, ఇం తలోనే షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. హైద రాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది. శుక్రవా రం నాడు సాయంత్రం నగర వ్యా ప్తంగా వర్షం దంచి కొట్టింది. దాదా పు రెండు గంటల పాటు భారీ వర్షం (heavy rain) కురిసింది. అంతేకాదు రాబోయే రెండు రోజులు సైతం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం (Weather station) హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజులు ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూ చించింది. హైదరాబాద్, నగరం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ జలయమం అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో 60 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బన్సీలాల్‌పేటలో అత్యధికంగా 68.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గన్‌ఫౌండ్రీలో 68.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్‌లో 67.0, బేగంబజార్‌లో 62.8, నాచారంలో 61.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
అధికారులు అప్రమత్తం.. హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు (heavy rain) కురుస్తాయని వాతా వరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎస్ డీఆర్ఎఫ్, మున్సిపల్ అధి కారులను (SDRF and municipal officials)సిద్ధం చేశారు. వర్షం కార ణంగా నీరు రోడ్లపై నిలవకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిం చారు. అవసరమైతే తప్ప బయట కు రావొద్దని హెచ్చరించారు.