Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rain Alert: తెలంగాణలో రెండ్రోజులు వానలే వానలు..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Rain Alert: ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉం దని వాతావరణ శాఖ వెల్లడిం చింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert)ను జారీ చేసింది.శుక్రవారం ఆదిలా బాద్, నిర్మల్, నిజామాబాద్, జన గామ, సిద్దిపేట, యాదాద్రి భువన గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, వికారా బాద్, సంగారెడ్డి, మెదక్, కామా రెడ్డి, మహబూబ్నగర్, నాగర్క ర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మోస్త రు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. శనివారం నిజామా బాద్, జనగామ, సిద్దిపేట, యా దాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైద రాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయ ణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ను (Yellow alert) జారీ చేసింది. హైదరా బాద్ లో రెండ్రోజుల పాటు మబ్బు పట్టి ఉంటుందని, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

పొద్దున ఎండ.. సాయంత్రం వానరాష్ట్రంలో పొద్దునంతా ఎండ కొట్టగా.. సాయం త్రం కాగానే ఒక్క సారిగా వాతావరణం మారిపో యింది. హైదరాబాద్ సిటీ (Hyderabad City)సహా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెల కొంది. గురువారం నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నిజామా బాద్, మెదక్, వికారాబాద్, హైదరా బాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా వేల్తూరులో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది.

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో (Kondamallepalli) 7 సెంటీ మీటర్లు, ఎర్రారంలో 6.7, కోదండాపురంలో 6.3, నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్లో 6.1, నల్గొండ జిల్లా చలకుర్తిలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలో పలు చోట్ల మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. అంబర్పేటలో 2.3 సెంటీమీటర్లు, కంచన్బాగ్లో 2.1, ఆస్మాన్ఘర్లో 1.9, చంపాపేట్లో 1.9, హిమాయత్నగర్లో 1.7, ఎల్బీనగర్లో 1.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయ్యింది. కాగా, ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 40.9 డిగ్రీలు, సూర్యాపేట జిల్లాలో 40.6, కామారెడ్డి 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.