–భారీ వర్షాల ప్రజలను కాపాడేం దుకు రోడ్లపై నీరు నిలవకుండా ప్రణాళికలు
–వర్షాలు కురిసినప్పుడు ఫిజికల్ పోలీసింగ్ అమలు చేస్తున్నాం
–హైదరాబాద్‌కు మరింతగా గొప్ప బ్రాండ్ ఇమేజ్ తీసుకోస్తాం
–అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా, ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ త ప్పుడు ప్రచారం
–10 నెలలు కూడా కాకముందే బి ఆర్ఎస్ నేతల పెళ్లుబికుతోన్న ఆక్రోశం
–రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఎమ్మెల్యే లు కలిసిరావాలని విన్నపం
–శాసనసభలో ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి
Rains:ప్రజా దీవెన, హైదరాబాద్: వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) భాగ్య నగరా న్ని హైదరాబాద్ మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లే లక్ష్యంతో తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాజధాని నగరానికి అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అత్యధిక వర్షాలు (Heavy rains) కురిసినపుడు రోడ్లపై నీళ్లు నిలవకుండా హార్వెస్టింగ్ వెల్స్ (వర ద బావులు) డిజైన్ చేయాల్సిందిగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆ మేరకు అధికారులకు సూచించామ ని తెలిపారు. 141 ప్రాంతాలను గు ర్తించి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బం దిని అప్రమత్తం చేసేలా, వర్షాలు కురిసినప్పుడు ఫిజికల్ పోలీసింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రాబోయే వందేళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని హైడ్రాను ఏర్పాటు చేశామని, దీంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. హైడ్రా పరిధిని 2వేల కిలోమీటర్లకు విస్తరిస్తామన్నారు.
శుక్రవారం శాసనసభలో (In the legislature) హైడ్రాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ము ఖ్యమంత్రి మాట్లాడారు. చారిత్రక కట్టడాలతో అద్భుత నగరంగా విలసిల్లినహైదరాబాద్ మరింతగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. నగ రంలో చెరువులు ఆక్రమణకు గుర య్యాయని, దానిని నియంత్రించే బాధ్యత కూడా హైడ్రా తీసుకో నుం దని చెప్పారు. గతంలో గంటకు 2 సెం.మీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో డైన్రేజ్ వ్యవస్థను డిజైన్ చేశారని, అయితే వాతావ రణ మార్పులతో కుంభవృష్టి కురు స్తూ వరదలు వస్తున్నాయని అన్నా రు. ఇలాంటి సమస్యల శాశ్వత పరిష్కారానికే హైడ్రాను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇకపై నాలాలను ఆక్రమించాలంటే గుండె ల్లో గుబులు పుట్టేలా వ్యవస్థను తీసుకొస్తున్నామని చెప్పారు. నగ రానికి కాంగ్రెస్ ప్రభుత్వం 1965లో మంజీరా జలాలను తెచ్చిందని, 1982లో సింగూరు జలాలు, 200 4లో కృష్ణా ఫేజ్–1, కృష్ణా ఫేజ్–2 ద్వారా తాగునీరు అందించిందని రేవంత్ వివరించారు. 2014లో ఫేజ్ 3లో 90 పనులు కాంగ్రెస్ పూర్తి చే స్తే, 2015లో తామే తెచ్చినట్లు బీ ఆర్‌ఎస్ నేతలు చెప్పుకొన్నారని ఎద్దేవా చేశారు.
గతంలో చంద్రబా బు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (Chandraba Bu, YS Rajasekhar Reddy)నగర అభి వృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. హత్యలు, అత్యాచారాలు జరుగు తున్నాయంటూ బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయ త్నం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వారి పాలనలో సింగ రేణి కాలనీలో గంజాయి మత్తులో ఆడబిడ్డను రేప్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని ధ్వజమెత్తారు. దిశ అత్యాచార ఘటనలోనూ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని పేర్కొన్నారు. మొయినాబాద్ వద్ద టీఆర్‌ఎస్ నా యకుడు హత్యాచారం చేస్తే ఎటు వంటి చర్యలు తీసుకోలేదని అన్నా రు. వారి హయాంలో ఇంత జరిగి తే అబద్ధాల ప్రాతిపదికన తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో పాన్ డబ్బాలో గంజాయి దొరికే పరిస్థితి ఉండేదని, కానీ.. నేడు దానిని అమ్మాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చామని అన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా 55 కి.మీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు చేపట్టనున్నామని సీఎం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.లక్షన్నర కోట్ల కు పెంచారంటూ కేటీఆర్ అనవస రంగా విమర్శిస్తున్నారని, కానీ వారి హయాంలో కాళేశ్వరం కడితే కూలి పోయిందని గుర్తు చేశారు. తాము పని మొదలుపెట్టకముందే ఆయన డీపీఆర్ అడుగుతున్నారని, కాంట్రా క్టర్లతో మాట్లాడుకుని కమీషన్లు దండుకునేందుకా అని ప్రశ్నించారు. మీరు పదేళ్లు పాలించారు. పది నెలలు కూడా కాకముందే మాపై ఎందుకింత ఆక్రోశమని సీఎం ధ్వజ మెత్తారు.మూసీ రివర్ ఫ్రంట్‌లో ఆక్ర మణల్ని గుర్తించి వారికి ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలి పారు.మిషన్ భగీరథ ద్వారా గజ్వే ల్‌కు నీళ్లిచ్చామని కేటీఆర్ చెబుతు న్నారని, కానీ.. కాంగ్రెస్ నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరా బాద్ వచ్చే నీటినే మధ్యలో పైపు లైన్ ద్వారా గజ్వేల్‌కు అందించారని రేవంత్ అన్నారు. హైదరాబాద్ నగ ర అభివృద్ధికి అందరి సలహాలు తీసుకోవాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు.
మిరాలం చెరువుపై (On Miralam Pond)2.6 కిలోమీటర్ల సస్పెన్షన్ బ్రిడ్జిని, ఆ చెరువులో లండన్ ఐ లాంటి టవ ర్‌ను నిర్మిస్తామన్నారు. గత ప్రభు త్వం వారి విలాసవంతమైన జీవి తం కోసం ప్రగతి భవన్, ఆఫీసు కో సం సచివాలయం నిర్మించింది త ప్ప ప్రజల కోసం చేసిందేమీ లేద న్నారు. సచివాలయంలోని గుడికి వందల ఏళ్ల చరిత్ర ఉందని, కానీ వాళ్ల సెంటిమెంట్ కోసం ప్రజల సెంటిమెంట్‌ను ఫణంగా పెడితే ఏమైందో చూశామని వ్యాఖ్యానిం చారు. రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేద్దామని చెప్పినా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు ముందుకు రావ డం లేదని ప్రశ్నించారు. ఆయన పాత మిత్రుడికి కోపం వస్తుందని ముందుకు రావడంలేదేమోనని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే లంతా కలిసి రావాలని, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమ తులు, నిధులను తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.